Begin typing your search above and press return to search.

కరోనా నిజాలను ధ్వంసం చేశాం.. ఒప్పుకున్న చైనా

By:  Tupaki Desk   |   16 May 2020 5:40 PM IST
కరోనా నిజాలను ధ్వంసం చేశాం.. ఒప్పుకున్న చైనా
X
చైనాలోని వూహాన్ లో పుట్టి ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ పై సంచలన రహస్యాన్ని చైనా బయటపెట్టి దుమారం రేపింది. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను నివ్వెరపోయేలా చేసింది.. అమెరికా ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

తాజాగా కరోనా వ్యాపించిన తొలి నాళ్లలో సేకరించిన నమూనాలను నాశనం చేయాలని జనవరి 3న తామే ఆదేశించినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. ప్రయోగాత్మకంగా వినియోగానికి సేకరించిన నమూనాల వల్ల వైరస్ మరింత మందికి వైరస్ వ్యాపించకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చైనా ప్రకటించింది.

అనుమతులు లేని ప్రయోగశాలల్లో నమూనాలనే ద్వంసం చేయాలని ఆదేశించామని.. ఈ విషయాన్ని అమెరికా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. వైరస్ పరీక్షలకు అవసరమైన రక్షణ సదుపాయాలు లేని ల్యాబుల్లోని నమూనాలను ధ్వంసం చేయనున్నామని పేర్కొన్నారు.

గతంలో ఇన్ ఫ్లూయోంజా, సార్స్ వైరస్ నమూనాలను ప్రపంచదేశాలకు చైనా అందించింది. అయితే కరోనా విషయంలో అలా చేయలేదు. దీంతో కరోనాను చైనానే తయారు చేసిందని అమెరికా ఆరోపించింది. ఇప్పుడు చైనా కూడా కరోనా వైరస్ పై నిజాలను పాతరేసిందని అర్థమవుతోంది.