Begin typing your search above and press return to search.
కరోనా చైనాలో పుట్టిందనుకుంటున్నారా..? శివుడి రోమాల నుంచి పుట్టింది!
By: Tupaki Desk | 26 Jan 2021 2:00 PM ISTనమ్మకానికి.. మూఢ నమ్మకానికి మధ్య సన్నటి గీత ఉంటుంది. దాన్ని గుర్తించ లేనప్పుడు.. అది చెరిగిపోయినప్పుడు.. జరిగే దారుణాలు ఊహకందకుండా ఉంటాయి. ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకున్న విషాదం అలాంటిదే. సమాజంలో వేళ్లూనుకున్న మూఢ విశ్వాసాలు ఏ స్థాయిలో పాతుకుపోయాయో మరోసారి ఎత్తిచూపిందీ ఘటన! ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు హత్యకు గురవడం వెనక వారి తల్లిదండ్రులతోపాటు మూఢ విశ్వాసాలు బలమైన కారణంగా ఉన్నాయని తేలింది.
ప్రాణం తీసిన క్షుద్ర పూజలు..
మదనపల్లెలోని ఆదివారం రాత్రి పట్టణంలోని శివనగర్‌లో నివాసం ఉంటున్న ఉమెన్స్ డిగ్రీకాలేజీ ప్రిన్సిపల్ పురుషోత్తం నాయుడు, ఆయన భార్య పద్మజ క్షుద్రపూజల పేరుతో తమ కుమార్తెలు అలేఖ్య(27), సాయిదివ్య(22)ను ఇంట్లో హత్యచేసిన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలకు సోమవారం సాయంత్రం బంధువులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి వల్లేరు పురుషోత్తం నాయుడు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తల్లి పద్మజ మానసిక స్థితి మేరకు.. అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి తీసుకువచ్చినప్పటికీ.. దూరంగా ఉంచారు.
ఉన్నత విద్యావంతులు..
తవణంపల్లె మండలం కొండ్రాజుకాలువకు చెందిన పురుషోత్తం నాయుడు, చిత్తూరు పట్టణానికి చెందిన పద్మజ దంపతులు పాతికేళ్ల క్రితం మదనపల్లెకు వచ్చారు. పురుషోత్తం నాయుడు పీహెచ్‌డీ ఇన్ కెమిస్ట్రీ పూర్తిచేసి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. భార్య పద్మజ మాస్టర్‌మైండ్స్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా 23 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరంటే తల్లిదండ్రులకు విపరీతమైన ప్రేమ. ఇద్దరినీ ఉన్నత చదువులు చదివించారు. పెద్దమ్మాయి అలేఖ్య భోపాల్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి సాయిదివ్య బీబీఏ పూర్తిచేసుకుని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటోంది.
కొత్త ఇంట్లో గృహప్రవేశం..
ఆరు నెలల క్రితం వరకు ప్రశాంత్‌నగర్‌లోనే నివాసం ఉన్న ఈ కుటుంబం శివనగర్‌లో నూతనంగా ఇల్లు నిర్మించుకుని ఆగస్టు 14న గృహప్రవేశం చేసింది. ఇంట్లో చేరిన రోజు నుంచి ఏదో ఒక పూజ, వ్రతాలు చేస్తూనే ఉన్నారు. కరోనా కారణంగా బంధుమిత్రులను ఆహ్వానించకుండా.. గృహ ప్రవేశం కానిచ్చారు. ఇంట్లోకి వచ్చింది మొదలు.. ఎవరూ బయటకు వచ్చేవారు కాదని చుట్టుపక్కలవారు చెబుతున్నారు. మూఢ విశ్వాసాలను బలంగా ఆచరించే వీరు.. కొత్త ఇంట్లో కీడు అంటూ ఎవరైనా క్షుద్రమాంత్రికులను కలిసి ఉండొచ్చని, వారు చెప్పిన విధంగానే వీరు ఇంట్లో పూజలు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారం క్రితం..
వారం రోజుల క్రితం అక్కాచెల్లెళ్లు అలేఖ్య, సాయిదివ్య ఇద్దరూ పెంపుడు కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లారు. రోడ్డులో వేసిన ముగ్గులో ఉంచిన నిమ్మకాయలు.. పసుపు.. కుంకుమలను తొక్కారని.. ఆ విషయాన్ని ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి ఏదో జరుగుతుందన్న భయం వారిని వెంటాడేదని చెబుతున్నారు. అప్పటి నుంచి వారు మౌనంగా ఉంటున్నారని.. ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని వారు చెప్పేవారంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి ఒక మంత్రగాడిని సంప్రదించి తాయిత్తు వేసుకున్నారని, పిల్లలు భయంగా ఉండడంతో వారం నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ కాలేజీకి కూడా వెళ్లటం లేదని తేలింది. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో పూజలు మొదలు పెట్టారు.
చిన్నప్పటి నుంచే..
కూతుళ్ల హత్యకు సంబంధించిన వివరాలను తండ్రి పురుషోత్తం వెల్లడించారు. నాలుగు రోజులుగా ఇద్దరు కూతుళ్లకు మతిస్థిమితం లేదని, పూర్తిగా అలౌకిక జగత్తులోకి వెళ్లిపోయారని, తనతోనూ సరిగ్గా మాట్లాడలేదని ఆయన చెప్పారు. పెద్దమ్మాయి అలేఖ్య తొమ్మిదో తరగతి నుంచే తాను శివస్వరూపాన్ని అని చెప్పేదన్నారు. తనకు మహిమలు ఉన్నట్లు చెప్పేదని, చిన్నమ్మాయి సాయిదివ్య.. ఇంట్లో ఏవో శక్తులు తిరుగుతున్నాయని భయపడుతూ.. ఇక్కడి నుంచి వెళ్లిపోదామని ప్రాధేయపడేదని చెప్పాడు పురుషోత్తం.
అర్ధనగ్నంగా పూజలు..
ఇల్లు ఖాళీ చేయకపోతే .. డాబాపై నుంచి దూకేస్తానని చిన్న కూతురు చెప్పడంతో మూడు రోజులుగా కాపలా కాసినట్లు వెల్లడించాడు పురుషోత్తం. చిన్న కూతురు దివ్యను తనదారిలో తెచ్చుకునేందుకు అలేఖ్య లేనిపోని భయాలను కలిగించి మెల్లగా తన వశం చేసుకుందని చెప్పారు. అలేఖ్య చిన్నచిన్న గారడీలు చూపించడంతో అతీతశక్తులు ఆవహించినట్లు తాను కూడా నమ్మానని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో.. మూఢ నమ్మకాలను పూర్తిగా ఆవహించుకున్న కుటుంబం.. ఆ భయాలకు దూరంగా ఉండేందుకే కొత్త ఇంట్లోకి మారినట్టు తెలుస్తోంది.
మొదట చెల్లిని..
కొత్త ఇంట్లో తల్లీ కూతుళ్లు అర్ధనగ్నంగా పూజలు నిర్వహించినట్టు చెప్పాడు పురుషోత్తం. ఈ క్రమంలోనే తన చెల్లిలో ఉన్న దుష్టశక్తిని చంపేస్తున్నానంటూ లేఖ్య కత్తి చేతబట్టిందట. శక్తిపూజ ముగ్గు వేస్తున్నట్టుగా ఆమె నుదున కత్తితో గుచ్చి ఆ బొమ్మ వేసిందట. ఈ క్రమంలో విలవిల్లాడుతూ దివ్య ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించాడు తండ్రి. తర్వాత పసుపునీళ్లతో శుద్ధిచేసి వేపాకుమీద పడుకోబెట్టారని తెలిపారు.
తర్వాత అక్కను..
ఆ తర్వాత అలేఖ్య ఎరుపు వ్రస్తాలు ధరించి.. శక్తి తనను ఆవహించిందని, కలి అంతం కాబోతోందని, నన్ను కూడా చంపమని చెప్పిందట. తాను వెళ్లి మళ్లీ చెల్లిని తీసుకొస్తానని చెప్పిందట. తనను చంపిన తర్వాత.. చెల్లికి ఎలాగైతే చేశామో అవన్నీ తనకూ చేసి మంత్రాన్ని చదివితే.. తాను, చెల్లి తిరిగి వస్తామని అలేఖ్య చెప్పిందట. ఈ పూజ జరిగేంతవరకూ తనను గంట మోగించాలని చెప్పారని పురుషోత్తం చెప్పారు. దాదాపు గంటసేపు పూజ జరిగిన తర్వాత పెద్దకూతురు చెప్పిన విధంగా తన భార్య ఆమెను కడతేర్చిందని కన్నీటిపర్యంతమయ్యారు పురుషోత్తం. ఈ క్రమంలో తన భార్య పూజలో ఉండగానే.. తేరుకుని సహోద్యోగి ఫిజికల్ డైరెక్టర్ రాజుకు ఫోన్‌చేసి స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పమన్నానని తెలిపారు.
కరోనా చైనాలో పుట్టలేదట..
విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికి రాగా.. పురుషోత్తం భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంట్లో శివుడు ఉన్నాడు.. షూలు, చెప్పులు వేసుకుని రావద్దంటూ పద్మజ గట్టిగా కేకలు వేసిందట. అంతేకాదు.. ‘అనవసరంగా హైరానా పడవద్దు.. నా బిడ్డలు లేచి వస్తారు. శక్తి చెప్పింది’ అని వారితో వాదించిందట పద్మజ. విద్యావంతులు మీరిలా మాట్లాడడమేంటని పోలీసులు అడిగితే.. ‘మీకు మాకన్నా తెలుసా..? కరోనా చైనాలో పుట్టిందనుకుంటున్నారా..? శివుడి రోమాల నుంచి పుట్టింది. శివుడే అన్నింటికీ సమాధానం చెబుతారు’ అని వింతగా మాట్లాడినట్లు సమాచారం. అంతేకాదు.. ‘మహాద్భుతంగా ఉన్న స్వర్గాన్ని నాశనం చేశారు. అరగంట ఆగితే నా బిడ్డలు సంతోషంగా బతికి వచ్చేవారు. పూజాఫలాన్ని మొత్తం నా భర్తే నాశనం చేశారు. లేకపోతే నాకు ఈ కర్మ వచ్చేది కాదు’ అంటూ అరిచిందట పద్మజ.
కూతురి వింత ప్రవర్తన..
పెద్దమ్మాయి అలేఖ్య ఇన్‌స్ట్రాగాం అకౌంట్‌ను ఓపెన్‌చేసిన పోలీసులు.. మూడురోజుల క్రితం ‘శివ ఈజ్ కమింగ్’ అంటూ పెట్టిన పోస్ట్‌లను పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం పురుషోత్తం నాయుడు సహోద్యోగి వారి ఇంటికి రాగా.. ‘మీరు బుద్ధుడిలాగా ఉన్నారు.. మిమ్మల్ని కౌగిలించుకోవాలనుంది. మీ ఇంటికి తీసుకెళ్లండి అంకుల్’ అంటూ మారాం చేసిందట. చనిపోయిన సమయంలో ఆమె పక్కనే మెహర్‌బాబా పుస్తకం ఉంది. ఇంట్లోనూ ఎక్కడ చూసినా.. షిర్డీసాయిబాబా, అవతార్ మెహర్‌బాబా, ఓషో పుస్తకాలు, ఫొటోలు కనిపించాయి. నాలుగైదు రోజులుగా ఏవో పూజలు చేస్తున్నారని, అప్పుడప్పుడు కేకలు, అరుపులు వినిపించేవని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఆదివారం ఉదయం స్వామీజీ ఒకరు ఇంటికి వచ్చి ఇల్లంతా కలియదిరిగి మంత్రించిన నీళ్లను చల్లి నిమ్మకాయలు ఉంచి వెళ్లినట్లు తెలిసింది.
రూ.5కోట్లే కారణమా?
కాగా.. ఆర్థిక కోణంలోనూ ఈ హత్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పద్మజ కుటుంబీకుల నుంచి రూ.5కోట్ల ఆస్తి వాటాగా వచ్చిందట. ఆ డబ్బును కాజేసేందుకు పథకం పన్ని ఎవరైనా ఇలాంటి ఘాతుకానికి ఒడికట్టి ఉంటారా? అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు బంధువులు. మరి, ఏం జరిగింది? ఈ జంట హత్యల వెనకున్న కారణాలు ఏంటి? అన్న ప్రశ్నలకు పోలీసులు ఎలాంటి సమాధానాలు చెప్తారో చూడాలి.