Begin typing your search above and press return to search.
జాగ్రత్త : లాక్‌డౌన్లలో బరువు పెరుగుతోన్న పిల్లలు
By: Tupaki Desk | 15 Sept 2021 3:20 PM ISTకరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కారణంగా పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచినప్పటికి కరోనా భయంతో పిల్లలను ఇంటినుంచే చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉండటంతో పిల్లలు అధిక బరువు పెరుగుతున్నట్టు అమెరికన్ మెడికల్ అసోసియోషన్ జర్నల్ సర్వేలో తేలింది. 5-11 ఏళ్ల వయసున్న పిల్లలు కరోనా కాలంలో బరువు పెరిగినట్టు ఈ సర్వే పేర్కొన్నది. కోవిడ్ కాలంలో 5-11 ఏళ్ల లోపున్న పిల్లలు 2.5 కేజీల బరువు పెరిగారని, 12 ఏళ్లు పైబడిన పిల్లలు 2 కేజీల బరువు పెరిగినట్టు సర్వేలో తెలింది.
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివి తప్పనిసరి చేయాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే భవిష్యత్తులో అధికబరువు కారణంగా అనేక ఇబ్బందులో తలెత్తే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అధిక బరువు ఉండేవారికి చాలా సమస్యలు. తినే తిండిని తగ్గించుకోలేరు. తగ్గించుకోవడం మంచిది కూడా కాదు. కానీ కేలరీలు కరగాల్సిందే. ఇంట్లోనే ఉండిపోతే ఇక కేలరీలు ఎక్కడ ఖర్చవుతాయి, అదే బయటకు వెళ్లే ఛాన్సుంటే, జిమ్ముకో, పార్కుకో వెళ్లి ఎక్సర్‌సైజులు చెయ్యవచ్చు. అలాగే డ్యూటీలకు వెళ్లేటప్పుడు శారీరక శ్రమ ఉంటుంది కాబట్టి, కేలరీలు ఖర్చవుతాయి. ఇప్పుడు ఇళ్లలోనే చాలా మంది ప్రజలు ఉండిపోవాల్సి రావడంతో భారత దేశ ప్రజలు బరువు పెరిగే ప్రమాదం ఉంది. భారత్ లో అధిక బరువు ఉన్నవారు కోట్లలో ఉన్నారు. వారు ఇంట్లోనే ఉంటూ సింపుల్ ఎక్సర్ సైజులు చెయ్యమంటున్నారు డాక్టర్లు.
మెట్లు ఎక్కి దిగడం, డాబాపై రౌండుగా నడవడం, ఇంట్లో వస్తువుల్ని అటూ ఇటూ కదపడం, పాత వస్తువులు ఉంటే, వాటిని తీసి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, బట్టలు వాషింగ్ మెషిన్ లో కాకుండా చేతులతో ఉతుక్కోవడం, వంట చెయ్యడం ఇలాంటి ఏవో ఒక పనులు చేస్తూనే ఉండాలని సూచిస్తున్నారు. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల ముందు కూర్చొని సినిమాల వంటివి చూడటం కంటే, ఇంట్లో ఎప్పటి నుంచో పూర్తి చెయ్యాలనుకుంటున్న పనులను ఇప్పుడు చేసేసుకోవాలని సూచిస్తున్నారు. వీలైతే ఇల్లంతా ఓసారి క్లీన్ చేసుకోవడం లేదా సున్నం, పెయింట్ వంటివి వేసుకోవడం మేలంటున్నారు.
తద్వారా చాలా కేలరీలు కరుగుతాయంటున్నారు. తినే ఆహారం విషయంలోనూ తక్కువ కేలరీలు ఉండేవే తినాలని సూచిస్తున్నారు. వీలైనతవరకూ స్నాక్స్ తగ్గించమంటున్నారు. ఆకుకూరలు, కూరగాయల ఆహారం ఎక్కువగా తినాలని చెబుతున్నారు. ఫ్రైల బదులు, కూరల వంటివి మేలంటున్నారు. వంటల్లో నూనె వాడకం తగ్గించాలని సూచిస్తున్నారు.ఉదయం 7 గంటలకే బ్రేక్ ఫాస్ట్ చెయ్యాలనీ, రాత్రి 7 గంటలకే డిన్నర్ పూర్తి చెయ్యాలని చెబుతున్నారు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. అధిక బరువును తగ్గించుకుంటున్న కొద్దీ బాడీలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని మర్చిపోవద్దంటున్న డాక్టర్లు, ఏదో ఒకటి చేసి , కేలరీలు బర్న్ అయ్యేలా చేసుకోవాలని చెబుతున్నారు.