పెద్దల కంటే పిల్లలే 'కరోనా'ను తట్టుకోగలరు ... స్కూళ్లు ఓపెన్ చేయండి !

Wed Jul 21 2021 13:24:29 GMT+0530 (IST)

Children can tolerate 'corona' more than adults ... Open schools!

కరోనా మహమ్మారి ఇన్ఫెక్షన్లను చిన్నారులే ఎక్కువగా తట్టుకోగలరని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. అందుకే ముందుగా ప్రైమరీ స్కూళ్స్ తెరవాలని ఐసీఎంఆర్ సూచించింది. ఏది ఏమైనా స్కూల్ సిబ్బంది టీచర్లు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్లను పెద్దల కంటే పిల్లలే బాగా ఎదుర్కోగలని మాకు తెలుసు. యాంటీబాడీలు పెద్దల్లో మాదిరిగానే పిల్లల్లోనూ ఒకేలా ఉంటాయి. కొన్ని స్కాండీనేవియన్ దేశాల్లో మాత్రం ఎలాంటి కరోనా వేవ్ లొచ్చినా ప్రైమరీ స్కూళ్లను మూసివేయలేదు  అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు.ఐసీఎంఆర్ నాలుగు జాతీయ సీరోసర్వే ఫలితాల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో 40 కోట్ల మందికి ఇంకా కరోనా రిస్క్ ఉందని వెల్లడైంది. దేశంలోని ఆరేళ్ల వయస్సు పైబడిన మూడింట రెండు వంతుల జనాభాలో SARS-CoV -2 యాంటీబాడీలు ఉన్నాయని తేలింది. కరోనా వైరస్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసిఎంఆర్ జూన్ జూలైలో ఈ సర్వే నిర్వహించింది. 6 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భారత జనాభాలో మూడింట రెండు వంతుల లేదా 67.6 శాతం మంది జాతీయ సెరోసర్వేలో SARS-CoV-2 యాంటీబాడీలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.

దేశ జనాభాలో మూడోవంతు మందికి SARS-CoV-2 యాంటీబాడీలు లేవు. అంటే సుమారు 40 కోట్ల మంది ఇప్పటికీ కరోనా వైరస్ బారినపడే రిస్క్ ఉందని పేర్కొంది. ప్రభుత్వం ప్రకారం.. సర్వే చేసిన 85 మంది ఆరోగ్య కార్యకర్తలలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయి. హెచ్ సిడబ్ల్యు లలో పదోవంతు ఇంకా గుర్తించలేదన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ  సామాజిక మత రాజకీయ సమాజాలను నివారించాలని అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని ప్రభుత్వం సూచించింది. పూర్తిగా టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది.

దేశంలో కరోనా మరణాల సంఖ్య 10 రెట్లు పెరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నిన్న 374 మరణాలు సంభవించగా.. ఇవాళ ఏకంగా 3998 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోని 3509 మంది వైరస్‌తో మరణించగా.. మిగిలిన దేశమంతా 489 మరణాలు సంభవించాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 42015 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 31216337కి చేరింది. ఇందులో 407170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 36977 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 30390687కి చేరింది. అటు నిన్న 3998 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 418480 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 415472455 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అన్‌లాక్ కాగా.. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. థర్డ్ వేవ్ టెన్షన్ మొదలు కావడంతో కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచిస్తోంది.