Begin typing your search above and press return to search.

చిల‌క‌లూరిపేట‌లో ఎంత దారుణ‌మైన రోడ్డు ప్ర‌మాద‌మంటే?

By:  Tupaki Desk   |   1 July 2019 11:12 AM IST
చిల‌క‌లూరిపేట‌లో ఎంత దారుణ‌మైన రోడ్డు ప్ర‌మాద‌మంటే?
X
ఈ తెల్ల‌వారుజామున (సోమ‌వారం) గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలో భారీ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తెల్ల‌వారు జామున జ‌రిగిన ఈ రోడ్డు ప్ర‌మాదం మొత్తం కారు డ్రైవ‌ర్ త‌ప్పే కార‌ణ‌మంటున్నారు. ఇప్ప‌టికి ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మ‌ర‌ణించ‌గా.. మ‌రో ఆరుగురు తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అందులోని ఇద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉందంటున్నారు.

చిల‌క‌లూరి పేట ప‌ట్ట‌ణంలోని ఎన్టీఆర్ సెంట‌ర్ లో చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదానికి కార‌ణం చూస్తే.. తిరుప‌తి నుంచి పాల‌కొల్లు వెళుతున్న కారు ఒక‌టి రోడ్డు ప‌క్క‌గా నిలిచి ఉన్న లారీని బ‌లంగా ఢీ కొట్టింది. దీంతో.. కారులో ప్ర‌యాణిస్తున్న 11 మందిలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. కారు చాలా వేగంగా ఉండ‌టం.. అదుపు త‌ప్పి లారీని ఢీ కొట్టిన‌ట్లుగా భావిస్తున్నారు.

తెల్ల‌వారుజామున ఈ ప్ర‌మాదం జ‌రిగిన తీరు చూస్తే.. నిద్ర‌మ‌త్తులో డ్రైవ‌ర్ త‌ప్పు చేశారా? అన్న‌ది సందేహంగా మారింది. మ‌ర‌ణించిన ఐదుగురిలో ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు.వేగంగా వెళుతున్న కారు లారీని బ‌లంగా ఢీ కొట్ట‌టంతో ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. దీన్ని చూస్తేనే కారు ఎంత వేగంలో ఉన్న‌ది తెలిసే ప‌రిస్థితి.