Begin typing your search above and press return to search.
ఒకే వేదికపై కేసీఆర్, జగన్.. సంధా... సమరమా...!
By: Tupaki Desk | 10 Nov 2021 9:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి ఒకే వేదిక ఎక్కనున్నారు. చాలా నెలల తర్వాత.. ఇంకో మాటలో చెప్పాలంటే..రెండేళ్ల తర్వాత.. ఇరువురు సీఎంలు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గతంలో చంద్రబాబును విభేదించిన.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వైసీపీ అధినేత జగన్‌కు సానుకూలంగా మాట్టాడారు. ఆయన అధికారంలోకి వస్తే.. బాంగుటుందని భావించారు. 2019లో పరోక్షంగా కూడా సాయం చేశారని వినికిడి ఉంది. అయితే.. తర్వాత.. జల వివాదాలు వీరిని వేరు చేశాయి.
అప్పటి వరకు మిత్రుల మాదిరిగా.. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి.. విందు చేసి వచ్చారు. సమస్యలపై చర్చిం చుకున్నారు. కానీ.. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో కేసీఆర్‌కు రాజకీయ ఇబ్బందులు రావడంతో.. ఆయన ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఇక, అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య మాటలు లేవు. చేతల్లోనూ.. కేసీఆర్ దూకుడుగాఉన్నారు. ఇక, గోదావరి, కృష్ణా బోర్డుల విషయంలోనూ.. వారు ఇరువురు.. కూడా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శైలి ఒకేవిధంగా ఉండడం.. రాజకీయంగా చర్చకు వచ్చింది.
అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం కూడా కలిసే నిర్ణయం తీసుకున్నాయా ? అన్నట్టుగా.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేది లేదని..కరఖండీగా ప్రకటించారు. సో.. దీనిని వేర్వేరుగా చూడలేమని అంటున్నారు.. పరిశీలకులు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయనే సందేహాలు కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. రెండు రాష్ట్రాల సీఎంలు.. త్వరలోనే.. ఒకే వేదిక పంచుకోనున్నారు. తిరుపతిలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ఈ నెల 14న జరగనుంది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్.. జగన్‌లకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. వీరితోపాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలు, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ క్రమంలో ఒకే వేదికపైకి దాదాపు రెండేళ్ల తర్వాత.. సీఎంలు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలపై ఏమైనా చర్చించుకుంటారా? ముఖ్యంగా నీళ్ల విషయంలో.. మాటలు కలుపుకొని.. పరిష్కరించుకుంటారా ? లేదా మళ్లీ ఎడమొఖం... పెడమొఖంగానే ఉంటారా ? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అంతేకాదు.. కేంద్రంపై వ్యూహాత్మకంగా వ్యవహరించే అంశాలపైనా చర్చించుకుంటారనే ఆశలు ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.