Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి ఓఎస్డీ పీఏ అంటూ ..ఘరానామోసం?

By:  Tupaki Desk   |   1 April 2021 9:00 AM GMT
ముఖ్యమంత్రి ఓఎస్డీ పీఏ అంటూ ..ఘరానామోసం?
X
సెక్రెటేరియట్ లో డ్రైవర్ గా కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేశాడు. దీనితో సెక్రెటేరియట్ ప్రభుత్వ ఉద్యోగుల నుండి సీఎం పేషీ వరకు ఎలా ఉంటుందో పూర్తి అవగాహన వచ్చింది. అక్కడ అధికారులు, రాజకీయ నాయకులు చుట్టూ తిరిగే భాదితులు పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఎలాగైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఓ భారీ ప్లాన్ .. ఇంకేముంది సీఎం పీఏ , ముఖ్యమంత్రి ఓఎస్డీ అంటూ చలామణి అవుతూ ఉద్యోగాలు , డబుల్ బెడ్ రోడ్ ఇల్లులు ఇప్పిస్తానంటూ లక్షలు రూపాయలు అమాయకులను మోసం చేశాడంటూ ఓ వ్యక్తి పై ప్రసారమాధ్యమాల్లో ఓ వార్త ప్రచారం అవుతుంది. అతని పేరు సుధాకర్ ,రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పని చేస్తున్నాడట.

గతంలో సచివాలయం లో డ్రైవర్ గా పని చేసిన అనుభవం తో అక్కడ జరిగే కార్యకలాపాలు గమనిస్తూ ఎలాగైనా మనం కూడా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకొని అమాయకుల దగ్గర నుండి లక్షలు రూపాయలు వసూళ్లు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. తానూ సీఎం ఆఫీస్ లో పని చేస్తున్న , నేను ఎంత చెపితే అంత , మీకు ఏమి కావాలన్న నేను చిటికెలో పని చేసి పెడుతా అంటూ అందరిని నమ్మించాడట. చూడటానికి , మాటలు అలాగే ఉండటంతో నిజమేనేమో అని నమ్మి చాల మంది ఈ సుధాకర్ ఆశ్రయించారట. మీకు డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తాను అంటూ అమాయకులు నుండి డబ్బులు వసూలు చేశాడు , మరి కొంత మందికి పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాబ్ పేరుతో మోసాలు చేశాడు .. ఇక తక్కువ రేట్ కు బంగారం ఇప్పిస్తానని నమ్మబలికి లక్షలు రూపాయలు అడ్వాన్స్ రూపం లో డబ్బులు తీసుకొని మొహం చాటేశాడని పోలీసులు విచారణ లో తేలిందట.

ఏడాది కాలంగా కూకట్‌పల్లి-మియాపూర్ మార్గంలోని ఓ ఆశ్రమానికి సుధాకర్ తరుచూ వెళ్తున్నాడట. ఫార్చునర్ కారు,ప్రైవేట్ బాడీ గార్డ్స్,చుట్టూ అనుచరులు... ఇవన్నీ చూసి అక్కడి స్వామిజీలు అతన్ని హైప్రొఫైల్ వ్యక్తిగా భావించి , అతనికి మర్యాదలు బాగానే చేసేవారట. ఈ క్రమంలో ఓ బ్యాంకు మేనేజర్ భార్యతో అతనికి పరిచయం ఏర్పడిందట. ఈ క్రమంలో తాను పేద వర్గాలకు తక్కువ ధరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు ఆమెతో చెప్పాడు. దీనితో ఆమె తనకు తెలిసినవాళ్లు ఉన్నారని , వారికి కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరిందట. అందుకు రూ.5లక్షలు ఖర్చు అవుతాయని చెప్పాడట. అదే సమయంలో ఆమెకు,ఆమె స్నేహితులకు వీఐపీల ఇళ్లు ఇప్పిస్తానని చెప్పాడట. దీంతో ఆమె తన స్నేహితులు,తెలిసినవాళ్ల వద్ద నుంచి రూ1.23కోట్లు వసూలు చేసి అతనికి ఇచ్చిందట. సంక్రాంతి లోపు ఇళ్లు ఇస్తానని చెప్పిన సుధాకర్ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదట. దీంతో మోసపోయామని వారికి అర్థమైంది. ఇలా 80 నుండి 90మంది ని మోసం చేసినట్లు పోలీసులు విచారణ లో తేలిందని ఓ వార్త ప్రచారం అవుతుంది.

దీనితో ఈ గ్యాంగ్ లీడర్ సుధాకర్ పై నిఘా పెట్టి వీరి ఆగడాలకు కళ్లెం వేశారట టాస్క్ ఫోర్స్ పోలీసులు .. సీఎం పీఏ , సీఎం ఓఎస్డి పేరుతో ఫేక్ ఐడీ కార్డు తో పాటు డమ్మీ తుపాకీ , ఫార్చూనర్ కార్ , ఫేక్ పోలీస్ ఐడీ కార్డు లు , 14 సెల్ ఫోన్స్ తోపాటు కోటి ముప్పై లక్షలు నగదు , కోటి విలువైన ఇంటి డాక్యుమెంట్లు నిందితులు ముగ్గరు నుండి స్వాధీనం చేసుకున్నారు.