Begin typing your search above and press return to search.

విశాఖ నుంచి పాలన కు ముహుర్తం రెఢీ అయ్యిందా?

By:  Tupaki Desk   |   28 Jan 2020 3:37 PM IST
విశాఖ నుంచి పాలన కు ముహుర్తం రెఢీ అయ్యిందా?
X
ఒకసారి డిసైడ్ అయ్యాక.. విషయం ఏదైనా.. ఎంత పెద్దది అయినా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లే తీరు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డిలో ఎక్కువే. ఏపీలోని అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలంటే.. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని.. అందులో భాగంగా విశాఖను పాలనా రాజధాని గా ఎంపిక చేసుకున్న వైనం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించిన బిల్లు మండలిలో సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లటం తెలిసిందే.

ఇలాంటివేళ.. మండలినే రద్దు చేసే ప్రతిపాదనను ఏపీ అసెంబ్లీలోకి తీసుకురావటమే కాదు.. దానికి ఆమోదం తెలిపి.. కేంద్రానికి పంపారు. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలతో మండలి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అయితే..సీఎం జగన్ అనుకున్నట్లుగా విశాఖ నుంచి పాలన సాగించేందుకు వీలుగా జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది మొదలు విశాఖ నుంచి పాలన చేపట్టాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ముహుర్తం సమస్య లేకుండా ఉండటంతో పాటు.. మంచి రోజు కావటంతో.. ఉగాది చక్కటి ముహుర్తంగా భావిస్తున్నారు. విశాఖ నుంచి పాలన సాగించేందుకు అభ్యంతరాలు ఏమీ ఉండవన్న ఆలోచన లో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో రాజధానికి సంబంధించి ఎలాంటి నిర్వచనం లేకపోవటమే కాదు.. అసలు రాజధాని అన్న పదమే లేని నేపథ్యం ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పాలన షురూ చేస్తే.. అక్కడి నుంచే పాలన చేసినట్లు అవుతుందని చెబుతున్నారు.

ఈ వెసులు బాటుతో ఉగాది పండుగ రోజు నుంచి విశాఖను పాలనా రాజధాని గా చేసుకొని కార్యకలాపాలు స్టార్ట్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని కి సంబంధించి సాంకేతిక సమస్యల్ని వదిలేసి.. ముందుగా విశాఖ నుంచి పాలనను చేపట్టాలని సీఎం జగన్ డిసైడ్ అయినట్లుగా సమాచారం. ఇందు లో భాగంగా ఉగాది నాడు విశాఖ లో గృహ ప్రవేశం చేపట్టటమే కాదు.. అదే రోజు రాష్ట్రంలోని పాతిక లక్షల మంది ఇళ్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ రెండు కార్యక్రమాలతో అనధికారికంగా విశాఖ రాజధానిగా మారుతుందన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.