Begin typing your search above and press return to search.

జ‌న్మ‌లో మీడియాతో మాట్లాడ‌ను..సీఎం శ‌ప‌థం

By:  Tupaki Desk   |   23 Nov 2018 5:50 AM GMT
జ‌న్మ‌లో మీడియాతో మాట్లాడ‌ను..సీఎం శ‌ప‌థం
X
ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు..హాట్ హాట్ ప‌రిణామాల‌కు వేదిక‌గా నిలిచే పొరుగు రాష్ట్రమైన క‌ర్నాట‌క మ‌రోమారు ఇదే త‌ర‌హా ఎపిసోడ్‌ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డింది మొద‌లు పార్టీల ఎత్తులు - పొత్తులతో వార్త‌ల్లో నిలిచి అనంత‌రం కుంప‌టి రాజ‌కీయాల‌తో దేశం దృష్టిని త‌న‌వైపు తిప్పుకొన్న కర్ణాట‌క....ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్ ఇచ్చి మ‌ళ్లీ ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కింది. ఇలా ర‌క‌ర‌కాల ప‌రిణామాలు జ‌రుగుతున్న క్ర‌మంలోనే తాజాగా కర్ణాటక సీఎం హెచ్‌ డీ కుమారస్వామి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మిత్ర‌ప‌క్షాల కూట‌మికి సార‌థ్యం వ‌హిస్తున్న ఆయ‌న‌...ఇక తాను జన్మలో మీడియా ప్రతినిధులతో మాట్లాడబోనని ప్ర‌తిజ్ఞ చేశారు. త‌ద్వారా సంచ‌ల‌నం సృష్టించారు.

ఇటీవ‌ల ఓ మహిళా రైతు నేత రాష్ట్రంలోని అన్న‌దాత‌లు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల‌పై స్పందించారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే స్పందించాల‌ని కోరారు. దీనిపై కుమార‌స్వామి ఘాటుగా రియాక్ట‌య్యారు. గత నాలుగేళ్లు నిద్రపోయారా అని కర్ణాటక సీఎం హెచ్‌ డీ కుమార‌ స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సీఎం కుమారస్వామి మీడియా ముందుకు వ‌చ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని కన్నడ టీవీ చానెళ్లు వక్రీకరించినందు వల్లే ఈ సమస్య తలెత్తిందని కుమారస్వామి అన్నారు. ఒకవర్గం మీడియా పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. తాను చేసే చిన్న చిన్న ప్రకటనలనూ ఆ వర్గం మీడియా తమకు ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేసుకుంటున్నారని గురువారం అన్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కుమారస్వామి మీడియాకు దూరంగానే ఉంటున్నారు. నాకు నచ్చింది నేను మాట్లాడుతా. నేరుగా మీతో మాట్లాడను. మీరేం రాసుకున్నా అది మీ ఇష్టం. అసలు నా వార్తలు రిపోర్ట్ చేయకున్నా పరవాలేదు అని ఆగ్రహంగా అన్నారు. కాగా, సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న మీడియాను దూరంగా ఉంచడం కొస‌మెరుపు!