Begin typing your search above and press return to search.

మీడియాను బహిష్కరించిన సీఎం..

By:  Tupaki Desk   |   29 April 2019 6:02 AM GMT
మీడియాను బహిష్కరించిన సీఎం..
X
మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు ఏడుస్తున్నానందట వెనుకటికి ఓ ఇల్లాలు.. కర్ణాటకలో సీఎం కుమారస్వామి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సోదీలో కూడా ఉండడని భావించిన జేడీఎస్ అధినేత కుమారస్వామి ఏకంగా కింగ్ మేకర్ అయ్యి కాంగ్రెస్ సపోర్టుతో కన్నడ సీఎం అయ్యారు. సీటులో కూర్చునప్పటి నుంచి ఈయన సీటు చింపేసేందుకు బీజేపీ కాచుకు కూర్చుంది. ప్రతి ఆరు నెలలకోసారి కూలదోసేందుకు ఎత్తులు వేస్తోంది. ఇక కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా పోయింది. వాళ్లు కుమారస్వామిని సీఎంగా గుర్తించడం లేదు. కోర్కెల చిట్టా విప్పుతున్నారు. ఇలా సీఎం అయినప్పటి నుంచి ముళ్ల మీద కూర్చున్న అసహాయ సీఎంగా కుమారస్వామి ఏడుపులు, పెడబొబ్బలు పెడుతూనే ఉన్నారు.

రాజకీయంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు కాక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఉప ఎన్నికల పొత్తుల్లో కూడా కాంగ్రెస్ తో సర్దుబాటు కుదరడం లేదట..

ఉప ఎన్నికలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెస్ నేతలతో సీఎం కుమారస్వామి తాజాగా భేటి అయ్యారు. ఈ భేటిలో కుమారస్వామి ప్రతిపాదనలకు కాంగ్రెస్ వారు నో చెప్పారో లేక పట్టించుకోలేదో కానీ చిర్రుబుర్రులాడుకుంటూ బయటకొచ్చాడు. మీడియా ఊరుకుంటుందా ఆయన ముందు ఏం జరిగింది అని మైకులు పెట్టాయి.. దీంతో చిర్రెత్తుకొచ్చిన కుమారస్వామిని.. ఒక్కసారిగా ఊగిపోయారు.. తాను మీడియాను బహిష్కరిస్తున్నానని.. ఇకపై తన వద్దకు రావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పేశాడు. మీ ఇష్టమొచ్చిన కథనాలు రాసుకున్నా.. చూపించినా తనకు వచ్చే ఇబ్బంది లేదని.. తాను ఇకపై మీడియాతో మాట్లాడనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా కాంగ్రెస్ మీద కోసం మీడియా పై చూపించి కుమారస్వామి తన ఫస్ట్రేషన్ బయటపెట్టాడు.. చూస్తుంటే కుమారస్వామి కూడా ‘ఎఫ్2’ మంత్రం జపించాల్సిందే కాబోలు..