Begin typing your search above and press return to search.

ఏపీ పిటీషన్ నుంచి వైదొలగిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

By:  Tupaki Desk   |   4 Aug 2021 8:05 AM GMT
ఏపీ పిటీషన్ నుంచి వైదొలగిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
X
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు జల పంచాయితీ మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయ్యింది. ఈ మేరకు సీబీఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వ్యవహారంలో న్యాయపరమైన పరిష్కారం కోర్టుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం తరుఫున న్యాయవాదులు తెలిపారు. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రప్రభుత్వం తరుఫు న్యాయవాది కోరారు. కేంద్రం విజ్ఞప్తిని సీజేఐ ఎన్వీరమణ ధర్మాసనం తిరస్కరించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కే చెందిన ఎన్వీ రమణ ఆ రాష్ట్ర వ్యవహారంపై తీర్పునిస్తే పక్షపాతం చూపించినట్టు అవుతుందని అందుకే వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

అందుకే ఏపీ పిటీషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటీషన్ పై తాను విచారణ చేపట్టనని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కృష్ణ జలాల సమస్యకు పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రం కూడా సీజేఐ ఎన్వీరమణనే విచారించాలని కోరింది. కానీ రమణ మాత్రం ఈ పిటీషన్ నుంచి వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.