Begin typing your search above and press return to search.

హైకోర్టు జడ్జీలతో చీఫ్ జస్టిస్ సమావేశం? దీనిపైనే చర్చ!

By:  Tupaki Desk   |   25 May 2020 6:26 PM IST
హైకోర్టు జడ్జీలతో చీఫ్ జస్టిస్ సమావేశం? దీనిపైనే చర్చ!
X
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వరుసగా తీర్పులు వెలువరించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పులు ప్రజల్లో.. రాజకీయాల్లో చర్చనీయంశమవుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అధికార వైసీపీ నేతలు సహా సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుపుతున్నారు.

దీంతో తీర్పులపై తాజాగా ఏపీ హైకోర్టులో తన సహచర జడ్జీలతో చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సమావేశమయ్యారని కథనాలు వెలువడుతున్నాయి. కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో పోస్టులపై చర్చించినట్టు సమాచారం.

ఇక హైకోర్టు తీర్పులు.. పలువురు జడ్జీలపై జరుగుతున్న ప్రచారం.. వారు ఇచ్చిన తీర్పులపై వైసీపీ నేతలు... సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న వాదనలను హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి పరిశీలించినట్టు హైకోర్టు వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రివ్యూ సమావేశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.