Begin typing your search above and press return to search.

చిదంబరం బయటకా? జైల్లోనేనా?

By:  Tupaki Desk   |   28 Sept 2019 11:22 AM IST
చిదంబరం బయటకా? జైల్లోనేనా?
X
ముందస్తు బెయిల్ పిటిషన్ల దగ్గర నుంచినే కాంగ్రెస్ నేత పి.చిదంబరానికి తిరస్కరణలు ఎదురయ్యాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టే అవసరం లేదని కాంగ్రెస్ వాళ్లు వాదించారు. చిదంబరం తరఫు న్యాయబాది అయిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అలా వాదించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అరెస్టు జరిగింది. చిదంబరం కేరాఫ్ తీహార్ జైలుగా ఉన్నారు.

ఇటీవలే ఆయనను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా పరామర్శించారు. చిదంబరాన్ని సాధారణ లాకప్ లో ఉంచినట్టుగా తెలుస్తోంది. పెద్దగా ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏమీ లేవట. ఒకప్పుడు హోంమంత్రిగా దేశాన్ని శాసించిన చిదంబరం ఇప్పుడు తీహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు. అప్పుడు రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయించడంలో ఈయన చాలా దూకుడు గా వ్యవహరించారంటారు. ఇప్పుడు ఈయనే జైల్లో ఉన్నారు.

ఆ సంగతలా ఉంటే..చిదంబరం బెయిల్ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. ఢిల్లీ హై కోర్టులో చిదంబరం దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి అయ్యింది. అయితే తీర్పు మాత్రం ఇంకా రాలేదు. ఆ తీర్పును రిజర్వ్ లో ఉంచారు న్యాయమూర్తి. ఈ తీర్పు వెలువడేదాన్ని బట్టి..ఈ కాంగ్రెస్ సీనియర్ నేత బయటకు రావడమా, జైల్లోనే ఉండటమా..అనేది తేలుతుందని పరిశీలకులు అంటున్నారు.