Begin typing your search above and press return to search.

ప్రధాని మరోసారి బ్లాంక్ పేజీని వదిలేసారు ..చిదంబరం ఆసక్తికర ట్విట్ !

By:  Tupaki Desk   |   13 May 2020 12:00 PM IST
ప్రధాని మరోసారి బ్లాంక్ పేజీని వదిలేసారు ..చిదంబరం ఆసక్తికర ట్విట్ !
X
మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం, ప్రధానమంత్రి మోదీ విడుదల చేసిన ప్యాకేజీపై విమర్శలు గుప్పించారు. ఈ మహమ్మారి కారణంగా కష్టాల్లో ఉన్న భారత ప్రజలను ఆదుకునేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ అభియాన్ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్యాకేజీ పై స్పందించిన చిదంబరం ... నిన్నటి తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఓ వార్తకు సంబంధించిన హెడ్డింగ్ ను మాత్రమే చెప్పారని, దానికింద మాత్రం ఖాళీగా కనిపించేలా చేసారు అంటూ విమర్శలు కురిపించారు.

ఆర్థిక ప్యాకేజీ పై స్పందిస్తూ వరుస ట్విట్లు చేసారు ..హెడ్ లైన్ పెట్టి, పేజీని ఖాళీగా వదిలేసిన మోదీ, దాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేస్తారని చెప్పారు. నేను దాని కోసమే చూస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్యాకేజీ పై తాను నిన్ననే ఎందుకు స్పందించలేదన్న విషయాన్ని కూడా ఆయన వివరించారు. "నిన్న ప్రధాని ఓ హెడ్ లైన్ పెట్టి, పేజీని ఖాళీగా ఉంచారు. దీంతో సహజంగానే నేనెలా స్పందించాలో తెలియలేదు. ఇవాళ ఆ ఖాళీని ఆర్థిక మంత్రి పూరిస్తారని వేచి చూస్తున్నాను. ఆర్థిక వ్యవస్థ కోసం ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయినీ మేము జాగ్రత్తగా గమనిస్తాం" అని తెలిపారు. మొత్తంగా దీన్ని చిదంబరం.. హెడ్‌లైన్ అండ్ బ్లాంక్ పేజి అని అభివర్ణించారు.

'ముందు మనం గుర్తించాల్సింది పేదవాళ్లకు ఏం కావాలి, ఆకలి ఎట్లా తీరుతుంది, వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత వాళ్లకు ఏం కావాలి. దేశంలోని 13 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు. వారికి నిజమైన డబ్బు ఏ మేరకు అందుతుందో చూడాలి అని కూడా అన్నారు.