Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ వేళ.. చికెన్ ను ఆ రేంజ్లో కుమ్మేస్తున్నారట
By: Tupaki Desk | 14 May 2020 12:44 PM ISTమాయదారి రోగం చైనాలో స్టార్ట్ అయిన వేళ.. రెగ్యులర్ గా తినే చికెన్ ను బంద్ పెట్టేయటం తెలిసిందే. జిహ్వ చాపల్యం కోసం తినే కోళ్లతో లేనిపోనివి తగులుకుంటాయో అన్న భయాందోళనలతో చికెన్ ఇస్తామన్నా.. ఈసారికి వద్దులే బాసూ అనే పరిస్థితి. వారానికి ఒకసారి తప్పనిసరిగా లాగించే వారు సైతం.. దాదాపు నెల పాటు దూరంగా ఉండిపోయారు. దీంతో.. చికెన్ డిమాండ్ దారుణంగా పడి పోవటమే కాదు.. వందల కోట్ల నష్టాన్ని ప్రౌల్టీ పరిశ్రమ మూటకట్టుకుంది. దీన్ని భరించలేని వ్యాపారులు బతికున్న కోళ్లను గోతులు తీసి మరి.. కప్పేస్తే.. మరికొందరు వీధుల్లోకి వచ్చి ఉచితంగా ఇచ్చేసి వెళ్లిపోయారు.
చికెన్ తింటే ఎలాంటి సమస్యా ఉండదని నెత్తినోరు కొట్టుకున్నా పెద్దగా ప్రయోజనం కలగలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటివారైతే.. చికెన్ శుభ్రంగా తినొచ్చని.. ఎలాంటి సమస్యా ఉండదన్న మాట తర్వాత చికెన్ తినే ధైర్యం చేశారని చెప్పాలి. లాక్ డౌన్ మొదట్లో దారుణంగా పడిపోయిన చికెన్ అమ్మకాలు ఇప్పుడు ఊపందుకోవటమే కాదు.. ఇప్పుడు పీక్స్ కు చేరాయని చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ వినియోగం భారీగా పెరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో వారానికి ఒకసారి మాత్రమే చికెన్ తినే వారు.. ఇంట్లో ఉండిపోయిన నేపథ్యంలో వారానికి రెండు..మూడు సార్లుసైతం లాగించేస్తున్నారట. దీంతో.. చికెన్ వినియోగంతో పాటు.. ధర కూడా భారీగా పెరిగిపోయింది. లాక్ డౌన్ మొదట్లోకేజీ చికెన్ రూ.30 అమ్మితే.. ఇప్పుడు అది కాస్తా రూ.180 నుంచి రూ.240 వరకూ వెళ్లిపోయింది.
చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరిగిందన్న మాటను జనాలు నమ్మటంతో చికెన్ వినియోగంలో కొత్త రికార్డులు నమోదు అవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2019లో దేశ వ్యాప్తంగా చికెన్ వినియోగం 380 కోట్ల కేజీలుగా చెబుతారు. మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. రోజూవారీగా 10వేల టన్నులకు తగ్గకుండా చికెన్ సేల్ జరిగేది.
లాక్ డౌన్ కు కాస్త ముందు లేనిపోని భయాలతో చికెన్ వినియోగం భారీగా పడిపోతే.. ఏప్రిల్ లో పుంజుకుంది. ఏప్రిల్ చివరి వారం నుంచి చికెన్ అమ్మకాలు దుమ్ము రేపుతున్నాయట. ప్రస్తుతం రోజు 20 నుంచి 25 వేల టన్నుల చికెన్ అమ్మకాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ డిమాండ్ కు ఫౌల్ట్రీ పరిశ్రమ సిద్ధంగా లేకపోవటంతో డిమాండ్ కు తగినంత సప్లై చేయలేకపోతున్నారట. దీంతో.. ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ప్రభుత్వం ధరల్ని ఫిక్స్ చేసినా.. వ్యాపారులు మాత్రం డిమాండ్ కు తగ్గట్లు ఎక్కువ ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి.