Begin typing your search above and press return to search.
యూఎస్ లో జరిగిన పైశాచిక చేష్ట వింటే షాకే..
By: Tupaki Desk | 22 March 2017 5:44 PM ISTఅమెరికాలోని చికాగోలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. మాటల్లో చెప్పుకునేందుకు సైతం మనస్కరించని వైనం గురించి ఆందోళనలు అంతకంతకూ పెరగటమే కాదు.. మనిషన్న వాడు ఎందుకిలా తయారవుతున్నాడన్న సందేహం కలగక మానదు. జంతువులు సైతం చేయని దారుణాలకు పాల్పడుతున్న మనిషి తత్త్వం అంతకంతకూ బాధను..వేదనను మిగిల్చటం ఖాయం. షాపింగ్ కోసం వెళ్లిన పదిహేనేళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేయటమే కాదు..దాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశారు కొందరు దుర్మార్గులు.
ఫేస్ బుక్ పేజీలో చేసిన ఈ దారుణంలో మరింత దరిద్రమైన విషయం ఏమిటంటే.. లైవ్ స్ట్రీమింగ్ లో రేప్ చేస్తున్న వేళ..40 మంది చూస్తూ.. ఎవరూ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒక టీనేజర్ పై దారుణంగా వేధింపులకు పాల్పడుతున్నా..చూస్తూ ఉండటమే కానీ ఎవరూకంప్లైంట్ ఇవ్వకపోవటం దారుణమని పోలీసులు అధికారులు వాపోతున్నారు.
ఈ ఉదంతాన్ని ఫేస్ బుక్ దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు.. సదరు పోస్ట్ ను పేజీ నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆ పేజీ ఎవరదన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఐదారుగురు వరకూ ఈదారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం షాపింగ్ కు వెళ్లిన తన కుమార్తె ఇంటికి ఎంతకూ రాకపోయిన వేళలో.. తెలిసిన వారు ఫోన్ చేసి.. ఫేస్ బుక్ లోజరుగుతున్న దారుణం గురించి తెలపటంతో తమకీ విషయం తెలిసిందని వాపోతున్నారు. ఈ ఉదంతానికి కారణమైన వారి కోసం గాలిస్తున్న పోలీసులు.. ప్రస్తుతం బాధితురాలిని ప్రశ్నిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/