Begin typing your search above and press return to search.

అధికారికం: చోటా రాజ‌న్ దొరికింది నిజ‌మే

By:  Tupaki Desk   |   26 Oct 2015 1:59 PM GMT
అధికారికం: చోటా రాజ‌న్ దొరికింది నిజ‌మే
X
మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్టును కేంద్రహోం శాఖ దృవీకరించింది. ఇండోనేషియాలోని బాలీ పోలీసులు రాజన్‌ను అరెస్టు చేసినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ స్పష్టం చేశారు. అంతకముందు సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా కూడా రాజన్ అరెస్టును దృవీకరించారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని సీబీఐ డైరెక్టర్ తెలిపారు. తమ అభ్యర్థన మేరకే ఇంటర్‌పోల్ రంగంలోకి దిగిందని అనిల్ తెలిపారు. చోటా రాజన్ స్థానిక గుండా కాదని, అతను అంతర్జాతీయ నేరస్థుడని ఆయన స్పష్టం చేశారు.

అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ భారత దేశంలో పలు హత్య కేసుల్లో నిందితుడు. అతడి కోసం రెండు దశాబ్ధాలుగా వెదుకుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆస్ట్రేలియా ఫెడరల్‌ పోలీసులు అందించిన సమాచారం మేరకు ఇండోనేషియాలోని బాలిలో పట్టుకుని అదుపులో తీసుకున్నారు. ఈ క్రమంలో అతడికి సంబంధించిన పూర్తి వివరాలు క్లుప్తంగా...

- 55 ఏళ్ల ఛోటా రాజన్‌ అసలు పేరు రాజేంద్ర సదాశివ్‌ నిఖల్జి. బొంబాయిలో జన్మించాడు

- ఒకప్పుడు మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడుగా కొనసాగాడు. తర్వాత అతడి నుంచి విడిపోయి, దావూద్‌కు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచాడు.

- 1970-80 ల్లో ఛోటా రాజన్‌ తన కెరీర్‌ను బొంబాయిలోని సినిమా థియేటర్ల వద్ద బ్లాక్‌ మార్కెట్‌ టిక్కట్ల అమ్మకాలతో ప్రారంభించాడు.

- ఆ తర్వాత దావూద్‌ కు అనుచరుడై స్మగ్లింగ్‌ - హత్యలు లాంటివి చేశాడు.

- 1995 లో ఇంటర్‌ పోల్‌ అతడిని 'వాంటెడ్‌ మాన్‌'గా ప్రకటించింది. అప్పటినుంచి అతడి కోసం గాలింపు జరుగుతోంది.

- చాలాకాలంగా అతడు ఆస్ట్రేలియాలో వేరే ఐడెంటిటీతో నివశిస్తున్నాడు.

- 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌ లో ఓ హోటల్‌ లో ఉండగా అతడిపై దావూద్‌ అనుచరులు దాడికి ప్రయత్నించారు. దీంతో నేర్పుగా ఆ హోటల్‌ పై కప్పు నుంచి తప్పించుకోగలిగాడు

- ఈ తప్పించుకునే ప్రయత్నంలో కిందపడిపోవడంతో వీపుకి గట్టి దెబ్బతగిలింది. దాంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిన రాజన్‌ మళ్లి కనిపించలేదు.

- ఆ తర్వాత తగిన ప్రతీకారం కోసం వేచి ఉన్న ఛోటా రాజన్‌ , అతడి అనుచరులు 2001 లో దుబాయ్‌ లో దావూద్‌ అనుచరుడు శరద్‌ శెట్టిని హతమార్చగలిగారు.

- సిబిఐ ఆదేశాల మేరకు బాలిపోలీసులు ఆదివారంనాడు అతడిని పట్టకున్నారు. అయితే అతడు తన పేరు మోహన్‌ కుమార్‌ గా చెప్పుకున్నాడు.