Begin typing your search above and press return to search.

జ్యోతుల మాట; నో పాలిటిక్స్..ఓన్లీ ఫ్రెండ్ షిప్

By:  Tupaki Desk   |   27 March 2016 11:04 AM GMT
జ్యోతుల మాట; నో పాలిటిక్స్..ఓన్లీ ఫ్రెండ్ షిప్
X
రాజకీయాల్లో శాశ్విత మిత్రుడు.. శాశ్విత శత్రువు అనేది ఉండదన్న విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకూ తమకు తలలో నాలుకలా మెదిలి.. తమతో ఎంతో సన్నిహితంగా ఉండే నేతతో అనుబంధం అంతులేని దూరం పెరిగినట్లుగా ఫీల్ కావటం జరగుతుందా? అంటే.. రాజకీయాల్లో చాలా మామూలనే చెప్పాలి. నిన్నమొన్నటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ నేత జ్యోతుల నెహ్రుతో క్లోజ్ గా మూవ్ అయ్యే జగన్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

జ్యోతుల నెహ్రు పార్టీ మారిపోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఈ అంశం మీద రాయబారం చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నం షురూ చేశారు. అధినేత ఆదేశంతో కదిలిన ఆయన.. జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఉన్న జ్యోతులతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా అదినేత జగన్ తో కాసేపు ఫోన్లో మాట్లాడాలని కోరినా.. జ్యోతుల నో చెప్పినట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. రాజకీయాల గురించి మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేనని.. రాజకీయం వేరు.. ఫ్రెండ్ షిప్ వేరంటున్న జ్యోతుల మాటతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల నోట మాట రాని పరిస్థితి. రాజకీయాల గురించి మాట్లాడేందుకు వస్తే మాత్రం తానేం మాట్లాడలేనని.. స్నేహపూర్వక సంభాషణ అయితే ఓకేనని చెప్పటం చూస్తుంటే.. జ్యోతుల తర్వాత అడుగులు ఎలా ఉంటాయో అర్థమవుతున్నాయంటూ జగన్ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి వైఖరినే భూమా నాగిరెడ్డి విషయంలో చూశామని.. తాజాగా జ్యోతుల కూడా అదే రీతిలో ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. అంటే.. జ్యోతుల జంపింగ్ ఖాయమైనట్లేనా?