Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో లోకేశ్ పోటీపడుతున్నారా...?

By:  Tupaki Desk   |   16 Sept 2015 1:17 PM IST
చంద్రబాబుతో లోకేశ్ పోటీపడుతున్నారా...?
X
టీడీపీ నేతలపై వైసీపీ నేతల విమర్శల వర్షం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, రోజారెడ్డిలు టీడీపీ యువనేత లోకేశ్ సహా మంత్రులు, ఎమ్మెల్సీలపై విమర్శల వర్షం కురిపించారు.

చెవిరెడ్డి.. లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని ధ్వజమెత్తారు. లోకేశ్ కూడా చంద్రబాబు రూట్ లోనే వెళ్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణంలో సహకరించవద్దని తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సింగపూర్‌ కు లేఖలు రాస్తున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ అసత్యాలు చెబుతున్నారని చెవిరెడ్డి అన్నారు. అబద్దాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబు నాయుడుతో లోకేష్ పోటీ పడుతున్నారన్నారు.

మరోవైపు ముగ్గురు టీడీపీ నేతలను వైసీపీ ఎమ్మెల్యే రోజారెడ్డి సైకోలతో పోల్చారు. టిడిపి ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడులు సైకోల్లా వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జగన్ ను ఉద్దేశించి టీడీపీ సైకో అన్న తరువాత రాష్ట్ర రాజకీయాల్లో సైకో పదం వాడకం సాధారణమైపోయింది. తాజాగా రోజా టీడీపీ నేతలను సైకోలంటూ విమర్శించారు. ఏపీలో చంద్రబాబునాయుడు పాలన అరాచకపాలన అని ఆమె మండిపడ్డారు.