Begin typing your search above and press return to search.

ధోనీసేనకు భారీ షాక్​.. అనారోగ్యంతో బ్రేవో అవుట్​

By:  Tupaki Desk   |   21 Oct 2020 1:58 PM GMT
ధోనీసేనకు భారీ షాక్​.. అనారోగ్యంతో బ్రేవో  అవుట్​
X
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. ఇప్పటికే వరస ఓటములతో కుంగిపోతున్న జట్టుకు మరో షాక్​ తగిలింది. ఆ జట్టు ఆల్​రౌండర్​ బ్రేవో అనారోగ్యంతో ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్​-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో ధోనీ సేనకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ప్లేఆఫ్ రేసులో ఈ జట్టు ఉండేటట్టు లేదు. మరో నాలుగు మ్యాచ్‌లను చెన్నై సూపర్ కింగ్స్ ఆడాల్సి ఉంది. గాయం కారణంతో డ్వేన్ బ్రేవో వెళ్లిపోబోతున్నాడు. బ్యాటింగ్​ , బౌలింగ్​లో బ్రేవో సమర్థుడు. ప్రస్తుతం అతడు వెళ్లపోవడం చెన్నై కి తీరని నష్టమే. గాయం కారణంగా బ్రేవో వెళ్లిపోతున్నాడని చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.

ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే రైనా, హర్బజన్​ జట్టుకు దూరం అయ్యారని ఆయన తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్​ చరిత్రలో తొలిసారిగా వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లను ఆడిన ధోనీ సేన మూడింట్లో మాత్రమే నెగ్గింది. ఏడు అపజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉండటం ఇదే తొలిసారి.