Begin typing your search above and press return to search.
ఇది ట్వంటీనా.. టెస్టు మ్యాచా..చెన్నై పై సెహ్వాగ్ ఫైర్
By: Tupaki Desk | 9 Oct 2020 3:30 PM ISTఐపీఎల్-2020 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస అపజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే ఇదే సమయంలో ఆ జట్టుపై ట్రోల్స్, పంచులు పెరిగిపోయాయి. సాధారణ క్రికెట్ అభిమానులతో పాటు సెహ్వాగ్ లాంటి మాజీ క్రికెటర్లు జట్టును తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. జట్టు సభ్యుల అతివిశ్వాసం, తెలివితక్కువతనం తనంతో గెలవాల్సిన మ్యాచులు కూడా ఓడిపోతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. రీసెంట్ గా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచే మ్యాచ్ ను చేతులారా పొగొట్టుకోవడంతో విమర్శలు పదునెక్కాయి. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో చెన్నై విజయం సాధిస్తే తప్ప పరువు దక్కేలా లేదు. అబుధాబి లోని షేక్ జయేద్ స్టేడియం లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా ఓడి పోయింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. 157 పరుగులకే చతికిల పడింది. దీంతో చెన్నై అభిమానులు తీవ్ర నైరాశ్యం లో మునిగి పోయారు.
సెహ్వాగ్ ఓ అడుగు ముందుకేసి..
ధోనీ సేనపై తన దైన స్టయిల్లో పంచులు వేసాడు. తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. ‘చెన్నై జట్టులో ఒక్కరికన్నా తెలివిలేదు. డబ్బులు తీసుకున్నందుకు పనిచేయాలి కదా.. ఎలాగూ డబ్బులు వస్తాయి.. ఆడితే ఏంటి ఆడకపోతే ఏమిటీ అనుకుంటున్నారా? ఇదేమన్నా ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారా? ఒక్కరిలోనూ టీం స్పిరిట్ లేదు.. కెప్టెన్ తో పాటు మిగతా వాళ్లు కూడా అలాగే తయారయ్యారు.’ అంటూ సెహ్వాగ్ మండి పడ్డాడు. మరోవైపు కేదార్ జాదవ్ ఆటతీరును కూడా సెహ్వాగ్ తప్పుపట్టారు. ‘ ఓ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అలాగే ఆడతారా.. నింపాదిగా ఆడటానికి ఇదేమన్నా టెస్ట్మ్యాచా.. 12 బంతుల్లో 7 పరుగులు చేయడం అనేది అవమానం.’ అంటూ సెహ్వాగ్ సొంతంగా నిర్వహిస్తోన్న వీరూ కి బైఠక్ ప్రోగ్రామ్ లో సెటైర్లు వేశాడు. కేదార్ జాదవ్ ఓ యూజ్ లెస్ డెకరేషన్ గా తయారయ్యాడని చురకలు అంటించారు. ఒకప్పుడు ఐపీఎల్లో టాప్ జట్టుగా వెలిగిన చెన్నై కి ఈ గతి రావడంతో అభిమానులు, ముఖ్యంగా తమిళ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.