Begin typing your search above and press return to search.

వరద సీన్లోకి వచ్చిన మద్రాస్ హైకోర్టు

By:  Tupaki Desk   |   5 Dec 2015 12:38 AM IST
వరద సీన్లోకి వచ్చిన మద్రాస్ హైకోర్టు
X
చెన్నైను చిన్నాభిన్నం చేసిన భారీ వర్షాలతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు వినూత్నంగా స్పందించింది. విపత్తులు వచ్చిన సమయంలో న్యాయస్థానాలు చొరవ తీసుకొని ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు కనిపించవు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవమరించింది మద్రాస్ హైకోర్టు.

భారీగా ముంచెత్తిన వర్షాలతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలు అవుతున్న నేపథ్యంలో హైకోర్టు మానవత్వంతో రియాక్ట్ అయ్యింది. తాజాగా మద్రాసు రవాణా శాఖ కార్యదర్శితో సమావేశమైన అడిషనల్ అడ్వకేట్ జనరల్.. చెన్నై బాధితుల కోసం ఉచిత బస్సు సర్వీసుల్ని నడపాలని సూచించింది. బాధితుల్ని వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా రవాణా సౌకర్యం అందించాలని ఆదేశించింది.

సహజంగా ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయి. అందుకు భిన్నంగా కోర్టు స్పందించి.. సాయం చేయాలని చెప్పటం వినూత్న పరిణామంగా చెప్పాలి. చేతకాని ప్రభుత్వం చేతుల్లో అధికారం పోగుపడినప్పుడు చూస్తూ ఊరుకునే కన్నా.. హైకోర్టు చురుగ్గా వ్యవహరించి.. ఇలాంటి నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామంగా చెప్పాలి.