Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో చిరుత
By: Tupaki Desk | 13 Dec 2020 2:14 PM ISTఓవైపు కరోనా భయం వణికిస్తుంటే.. ఇది సరిపోని హైదరాబాద్ నగర జీవులకు కొత్త టెన్షన్ పట్టేలా చేసింది. నిత్యం ట్రాఫిక్ తో హడావుడిగా ఉండే ఐటీ కారిడార్.. కరోనా కారణంగా బోసి పోయింది. గతానికి భిన్నంగా ఇప్పుడు ట్రాఫిక్ పెద్దగా ఉండటం లేదు. గడిచిన ఆరేడు నెలలతో పోలిస్తే.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఇలాంటివేళ.. అనుకోని కొత్త భయం నగరజీవిని వెంటాడుతోంది. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. ఒక చిరుతపులి గచ్చిబౌలిలోని రోడా మిస్త్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ లో వచ్చింది.
మెరుపు వేగంతో వచ్చిన ఆ చిరుత. కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ విషయాన్ని ఆ కాలేజీ స్వీపర్ కళావతి చూసి.. భయంతో లోపలకు పరుగులు పెట్టింది. ఈ విషయాన్ని కాలేజీ సెక్రటరీకి చెప్పటంతో వారు రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓకు సమాచారం ఇచ్చారు. దీంతో.. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.
కాలేజీని సందర్శించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ మెట్ల మీద రక్తపు మరకల్ని గుర్తించారు.కాలేజీ పక్కనే ఉన్న గుట్టలోకి చిరుత వెళ్లి ఉంటుందని భావించారు. ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయగా.. ఎక్కడా కుక్క ఆనవాళ్లు కనిపించలేదు. అయితే.. పెద్ద ఎత్తున కోతులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న చోట్ల చిరుత బయటకు రావటం చాలా అరుదైన అంశంగా చెబుతున్నారు.
ఒకసారి వేటాడితే.. రెండు మూడు రోజులకు సరిపోతుంది కాబట్టి.. ఈ చిరుత మళ్లీ మూడు రోజుల తర్వాతే బయటకు వచ్చే వీలుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిరుతను ట్రాక్ చేసేందుకు కెమేరాల్ని పెద్ద ఎత్తున అమర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో చిరుత నగర శివారులో కనిపించి కలకలం రేపగా.. తాజాగా మరో చిరుత ఇలా ప్రత్యక్షం కావటం ఐటీ కారిడార్ కు కొత్త భయం పట్టుకున్నట్లుగా చెప్పక తప్పదు.