Begin typing your search above and press return to search.

ఆ మందుతో మూడు రోజుల్లో కరోనాకు చెక్ !

By:  Tupaki Desk   |   8 Aug 2020 5:00 AM IST
ఆ మందుతో మూడు రోజుల్లో కరోనాకు చెక్ !
X
కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి దేశాన్ని పట్టి పీడిస్తుంది. దాదాపుగా ఎనిమిది నెలలు అవుతున్న కూడా దీనికి సరైన వ్యాక్సిన్ ను ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. ఈ కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని చాలా దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వ్యాక్సీన్ వచ్చే అవకాశం ఉంది. చాలా దేశాలలో కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లో ఉంది. ఈ సమయంలోనే శాస్త్రవేత్తలు మరో శుభవార్త చెప్పారు. RLF -100 కరోనాను నివారిస్తోందనే విషయం చెప్పారు.

RLF-100: అంగస్తంభన సమస్యల నివారణ కోసం వాడుతుంటారు. దీనికి అవిప్టడిల్ అనే మరో పేరు కూడా ఉంది. ముక్కు ద్వారా పీల్చడం ద్వారం అంగస్తంభన సమస్యలు పరిష్కారమవుతాయి. కరోనా‌ తో బాధపడే రోగులపై ప్రయోగ జరిపేందుకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. శ్వాస వ్యవస్థ విఫలమై తీవ్ర స్థాయి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కరోనా బాధితులు త్వరగా కోలుకోవడానికి ఆర్ ఎల్ ఎఫ్ 100 ఔషధం బాగా పనిచేస్తున్నట్లు యూఎస్ ఏ వైద్య నిపుణులు తెలిపారు. యు ఎస్ .. ఎఫ్ డి ఎ ఆధ్వర్యంలో రెండవ దశ ప్రయోగ పరీక్షలు ఈ ఔషధం పూర్తి చేసుకోగా ఔషధం తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితి మూడు రోజుల్లో మెరుగైనది అని తెలిపారు. ఇక వెంటిలేటర్ పై ఉన్న వారిలో న్యుమోనియా ఉనికి పోగొట్టి బ్లడ్ ఆక్సిజన్ స్థాయిని ఔషధం మెరుగు పరిచింది. కరోనా సోకిన వారిని సైటోకైన్‌ స్టార్మ్‌ ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే RLF -100 వాడితే ఊపిరితిత్తుల కణాలు, ఏక కేంద్ర తెల్ల రక్తకణాల్లో వైరస్‌ సంఖ్య పెరగకుండా నిరోధిస్తోంది. దీనితో వైరస్ నుంచి వేగంగా కోలుకోవచ్చని తెలిపారు.