Begin typing your search above and press return to search.

కరోనా వేళ దీంతో కంట్రోల్ చేయవచ్చట..

By:  Tupaki Desk   |   9 Sep 2020 3:30 AM GMT
కరోనా వేళ దీంతో కంట్రోల్ చేయవచ్చట..
X
కరోనా వేళ కాఫీ దివ్య ఔషధంగా పనిచేస్తుందని తేలింది. కాఫీ వల్ల జలుబు, దగ్గు, ఉబ్బసం లక్షణాలు తగ్గిస్తుందని తాజాగా పరిశోధనలో నిరూపితమైంది. ఈ బిజీ లైఫ్ లో ఆఫీసు, పని ఒత్తిడి ఇలా సతమతమవుతూనే ఉంటాం.. కాసిన్ని టీ కానీ కాఫీ కానీ నోట్లో వేసుకోకపోతే పనే మొదలు పెట్టని వారుంటారు.. ఒక్క పూట ఆహారం లేకుండా అయినా ఉండగలుగుతారు కానీ కాఫీ లేనిదే గడవని పరిస్థితి చాలా మందిలో నెలకొని ఉంటుంది. ఈ విధంగా నిత్యజీవితంలో కాఫీకి, మనిషికి, అంత గట్టి బంధం ఏర్పడింది. కాఫీ వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

*కాఫీలో ఉండే కెఫిన్ వల్ల గుండెపోటుకు దారి తీసే హానికరమైన ఎంజైములు నశిస్తాయి.. ఇది రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది.

*రోజుకు మూడు కప్పుల కాఫీ తాగేవారిలో ఉబ్బసం వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.

* కాఫీ డికాషన్ సేవించడం వల్ల జలుబు, దగ్గు, అతినిద్ర, మూత్రం సాఫీగా నడవకపోవడం లాంటి లక్షణాలు తగ్గుతాయి.

*కొన్ని రకాల మందులు తీసుకున్నప్పుడు వాంతి వచ్చినట్టుండే అనుభూతిని కాఫీ తగ్గిస్తుంది.

అయితే కాఫీని అతిగా తాగితే నష్టమేనంటున్నారు వైద్యులు..
* రోజూ ఉదయం సాయంత్రం తక్కువ గాఢత గల కాఫీ తాగితే హాని ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయితే రోజులో ఎక్కువ సార్లు తాగితే వారికి జీర్ణశక్తి తగ్గిపోతుంది. ఆకలి లేకపోవడం.. గ్యాస్ట్రిక్ అల్సర్, రక్తపోటు, గుండె దడ, నిద్రలేమి, తలనొప్పిలతోపాటు వార్ధక్య లక్షణాలు కూడా త్వరగా కలుగుతాయట..

*పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాఫీని అలవాటు చేయొద్దు. దీనివల్ల వారి పెరుగుదల నిరోధించబడుతుంది.

*పరిగడపున ఉదయం తీసుకున్న కాఫీలోని కెఫిన్ జీర్ణకోశం నుంచి రక్తంలోకి చాలా త్వరగా వ్యాపించి తీవ్రమైన దుష్ప్ప బావాన్ని చూపిస్తుంది.