Begin typing your search above and press return to search.

డబ్ల్యూహెచ్‌ వో పేరుతో మోసం..చెక్ చేసుకొని విరాళం ఇవ్వండి!

By:  Tupaki Desk   |   3 April 2020 2:28 PM IST
డబ్ల్యూహెచ్‌ వో పేరుతో మోసం..చెక్ చేసుకొని విరాళం ఇవ్వండి!
X
మేము ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులం ..ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు గాను మీ వంతు సాయం చేయాలి. మేము ఏర్పాటు చేసిన సహాయనిధికి విరాళాలు ఇవ్వండి అని మెయిలు , వెబ్ సైట్స్ లో ప్రకటనలు ,ఫోన్ కాల్స్ , సోషల్ మీడియా లో మెసేజ్ లు , ఎస్ ఎమ్ ఎస్ లు లింక్స్ పంపితే నమ్మవద్దు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తమ పేరుతో ప్రజల నుండి నగదు , వారి విలువైన గోప్యమైన సమాచారాన్ని తస్కరించేందుకు సైబర్ నేరస్తులు చేసే ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని తెలిపింది.

అలాంటి మెసేజ్ లు వస్తే ..వాటికీ స్పందించే ముందే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని, తమ పేరుతో మోసపోవద్దు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తమ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే కరోనా రెస్పాండ్ ఫండ్ పేరుతో నిధుల సమీకరణకు ప్రత్యేక ఏర్పాటు చేశామని, ఎవరైనా తమ పేరుతో సందేశాలు పంపితే , తమ అధికారిక వెబ్ సైట్ లో వారిపై ఫిర్యాదు చేయాలనీ డబ్ల్యు హెచ్ వో తెలిపింది.

సాధారణంగా సైబర్ నేరగాళ్లు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. జనాల్లో వీరి మోసాలపట్ల ప్రస్తుతం కాస్త చైతన్యం పెరగడంతో పాత విధానంలో వీరి ఆటలు సాగడం లేదు. దీంతో కొత్త పోకడలతో మోసం చేయడం, ఖాతాలను ఖాళీ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం దేశం కరోనా విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో ఈ విధంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే ..మీరు ప్రజల మంచి కోసం అలోచించి చేసిన సహాయం ..వృధా అయిపోతుంది.