Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లోనూ బాదుడే బాదుడు!

By:  Tupaki Desk   |   10 May 2022 6:30 AM GMT
తెలంగాణ‌లోనూ బాదుడే బాదుడు!
X
విద్యుత్ ఛార్జీల పెంపుపై ఇప్ప‌టికే ఆంధ్రావ‌నిలో నిర‌స‌న‌లు రేగుతున్నాయి. గ‌తం క‌న్నా రెట్టింపు స్థాయిలో బిల్లులు వ‌చ్చాయ‌ని వివిధ వ‌ర్గాలు గ‌గ్గోలు పెడుతూ రోడ్డెక్కుతున్నాయి. ఒక‌నాడు మిగులు విద్యుత్ తో ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఎందుకు చీక‌టి మ‌యం అయింద‌ని అంటూ విప‌క్షాలు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూ ఉన్నాయి. ఇదే సంద‌ర్భంలో తోటి తెలుగు రాష్ట్రంలో స్థితిగ‌తులు కూడా ఇలానే ఉన్నాయి.

వేళాపాళా లేని కోత‌ల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అదేవిధంగా ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ఎంతో అందుబాటులో ఉండే రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌ప్పుడు అస్స‌లు క‌రెంట్ స‌మ‌స్య‌ల‌న్న‌వే లేకుండా చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు సింగ‌రేణి బొగ్గు గ‌నులు రాష్ట్రాని కి కాకుండా పోతున్నా కేంద్రం పై ఎందుకు పోరాటం చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఓపెన్ బిడ్డింగ్ పేరుతో సింగ‌రేణి బొగ్గు ప‌క్క రాష్ట్రాల‌కు త‌ర‌లిస్తున్నా ఎందుక‌ని నిలువ‌రించ‌లేక‌పోతున్నార‌ని నిల‌దీసేందుకు సిద్ధం అవుతున్నారు.

రాష్ట్రానికి ఆయువుప‌ట్టుగా నిలిచే బొగ్గు గ‌నుల విష‌య‌మై కానీ జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి విష‌య‌మై కానీ కేసీఆర్ పైకి చెప్పేవి ఒక‌టి లోప‌ల చేసేవి మ‌రొక‌టి అన్న‌విధంగానే ఉన్నాయ‌ని, ఈ తరుణంలో కేసీఆర్ స‌చ్ఛీల‌త‌పై ప‌లు సందేహాలే వ్య‌క్తం అవుతున్నాయి. నీళ్లు నిధులు అని చెప్పారు. నియామ‌కాలు గురించి కూడా చెప్పారు.

బాగుంది.. నీళ్ల కొట్లాట కార‌ణంగా జ‌ల‌విద్యుత్ ఉత్ప‌త్తి ఏమ‌యినా త‌గ్గిందా లేదా ఇది కూడా పైకి చెబుతున్న సాకేనా? ఆ మాట‌కు వ‌స్తే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం కేసీఆర్ చెప్పినంత హ్యాపీగా ఉన్నాయా.. అవి కూడా అధిక ధ‌ర‌కే విద్యుత్ కొనుగోలు చేయాల్సి వ‌స్తుందే ? అని కూడా విప‌క్ష స‌భ్యులు వాపోతున్నారు. అంటే బెస్ట్ పాల‌సీ అమ‌లు అంటూ ఏమీ లేకుండానే, యూజ‌ర్ ఫ్రెండ్లీ గవ‌ర్న‌మెంట్ అని చెప్పుకోవ‌డం స‌బ‌బు కాద‌ని హిత‌వు చెబుతున్నారు.

కరెంట్ బిల్లు
మార్చి - 286
ఏప్రిల్ - 775

రాష్ట్రం కోసం..

బంగారు తెలంగాణ కోసం..అని సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ ర‌ఘు అంటున్నారు. ఆయ‌నే కాదు చాలా మంది విద్యుత్ ఛార్జీల పెరుగుద‌ల విష‌య‌మై స్పందిస్తున్నారు. ఏపీలోనూ, తెలంగాణ‌లోనూ నాణ్య‌మ‌యిన నిరంత‌రాయ రీతిలో విద్యుత్ అందించే విష‌యమై ప్ర‌భుత్వాలు క‌నీస ఆలోచ‌న చేయ‌డం లేద‌ని విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లకు తార్కాణాలే ఇప్ప‌టి ఉదంతాలు. ఛార్జీల పెంపుపై ఉన్న ప్రేమ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచేందుకు ఎందుక‌ని లేకుండా పోతోంద‌ని, అందుకు కార‌ణాలేంట‌ని తాజాగా వ‌చ్చిన విద్యుత్ బిల్లులు చూపిస్తూ వినియోగ‌దారులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.