Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా తయారయ్యారు?

By:  Tupaki Desk   |   9 Feb 2020 4:07 PM GMT
ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా తయారయ్యారు?
X
మరో ప్రజాప్రతినిధిపై బీహార్‌ లో అత్యాచారం కేసు నమోదైంది. పాట్నాలోని తన ఇంట్లో మైనర్ బాలికపై రేప్‌ కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆర్జేడీ ఎమ్మెల్యే అరుణ్ యాదవ్‌ పై పోలీసులు స్పెషల్ పోస్కో కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. అక్రమ రవాణా - లైంగిక వేధింపులు - ఫోక్సో చట్టం కింద ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరోజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడు.

ఎమ్మెల్యే అరుణ్ యాదవ్ కేసులో అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి - అసెంబ్లీ కార్యదర్శికి ప్రత్యేక ఫోక్సో జడ్జి ఆర్కే సింగ్ నోటీసులు జారీ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధిని కోర్టులో హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేశారు. 2019 సెప్టెంబర్‌లో సెక్స్ రాకెట్‌ లో తన పేరు ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుండి అరుణ్ యాదవ్ పరారీలో ఉన్నాడు.

అరుణ్ యాదవ్ సందేశ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. అరుణ్ యాదవ్‌కు సంబంధించిన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. జిల్లాలోని పేద యువతులను... ఉద్యోగం పేరుతో మభ్యపెట్టి వారిని సెక్స్ రాకెట్‌ లోకి దించుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పాట్నాలో ఓ పేద బాలికను ఇలా ఉద్యోగం పేరుతో తీసుకెళ్లి సెక్స్ రాకెట్ లోకి దించారు. సదరు బాలిక తన కుటుంబం సహకారంతో ఆ కూపం నుంచి బయటపడింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె సదరు ప్రజాప్రతినిధి పేరును కూడా వాంగ్మూలంలో పేర్కొంది. అప్పటి నుంచి అతను కనిపించడం లేదు. గతంలో పలువురు ప్రజాప్రతినిధులపై కూడా అత్యాచారం ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంతమందిపై కేసులు నమోదయ్యాయి.