Begin typing your search above and press return to search.

చరణ్ కు పీఎంవో నుంచి మెసేజ్

By:  Tupaki Desk   |   2 Nov 2019 10:15 AM IST
చరణ్ కు పీఎంవో నుంచి మెసేజ్
X
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారెవరూ చేయని సాహసం ఒకటి చేసి అందరి కంట్లో పడ్డారు రాం చరణ్ సతీమణి ఉపాసన. ఆ మధ్య జాతిపిత గాంధీ 150 జయంతోత్సవం సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులతో పీఎం ప్రధాని భేటీ కావటం దీనిపై ఉపాసన ఒక ట్వీట్ చేసి..దక్షిణాది వారిని ఆహ్వానించకపోవటంపై తనకున్న బాధను ట్వీట్ తో చెప్పేశారు. ఉపాసన ట్వీట్ అప్పట్లో సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే.. తన తండ్రి చిరుతో నిర్మించిన సైరా చిత్రాన్ని ప్రముఖులకు చూపిస్తున్న చరణ్.. తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ అందుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లటం.. తిరిగి వచ్చిన తర్వాత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులు సెట్ అయిన తర్వాత తనను కలిసేందుకు వీలుగా చిరు అండ్ కోకు అపాయింట్ మెంట్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతానికి మోడీ అపాయింట్ మెంట్ ఫిక్స్ కానప్పటికీ.. త్వరలోనే భేటీ ఉంటుందన్న విషయంపై క్లారిటీ వచ్చిందంటున్నారు. ప్రధాని మోడీపై ఉపాసన చేసిన ట్వీట్ మీద తనకు అవగాహన లేదని.. ఒకవేళ తాను మోడీపై చేస్తున్న ట్వీట్ గురించి చెప్పినట్లైయితే.. ఆపేవాడినని చెర్రీ పేర్కొనటం గమనార్హం.