Begin typing your search above and press return to search.

డీకే కాన్వాయ్ పై చెప్పులతో దాడి

By:  Tupaki Desk   |   29 March 2021 10:09 AM IST
డీకే కాన్వాయ్ పై చెప్పులతో దాడి
X
డీకే కాన్వాయ్ పై చెప్పులతో దాడి
లేదా
ఆ పీసీసీ చీఫ్ పై చెప్పులతో దాడి

కర్ణాటకలో బయటపడ్డ ఓ మంత్రి రాసలీలల సీడీ వెనుక కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉన్నాడని బాధిత యువతి, ఆమె తండ్రి ఆరోపించడంతో ఈ సిడీ వివాదం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య చిచ్చుపెట్టింది. ఇరుపార్టీల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణల నుంచి దాడులు, నిరసనల దాకా వ్యవహారం ముదిరింది.

సీడీ కారణంతో మంత్రి పదవిని కోల్పోయిన బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి సొంత జిల్లా బెళగావిలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు చేదు అనుభవం ఎదురైంది.డీకే కాన్వాయ్ పై జార్కిహోళి అభిమానులు చెప్పులు విసరడం కలకలం రేపింది.

సోమవారం బెళగావి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సతీశ్ జార్కిహోళి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం విమానంలో డీకే శివకుమార్ బెళగావి వెళ్లారు. హోటల్ కు వెళుతుండగా రమేశ్ జుర్కిహోళి అభిమానులు దాడి చేశారు.

డీకే వాహనంపై నల్లజెండాలు చూపుతూ చెప్పులు విసరడం కలకలం రేపింది. ఈ దాడిలో కాన్వాయ్ లోని సెక్యూరిటీ వాహనం అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు చేరుకొని బందోబస్తు మధ్య శివకుమార్ ను హోటల్ కు తరలించారు.

ఈ దాడికి నిరసనగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పుష్ప ఆధ్వర్యంలో నాయకులు బెంగళూరులోని సదాశివనగర్ లో రమేశ్ జుర్కిహోళి నివాసం వద్ద ఆందోళన చేశారు.

యువతిపై అత్యాచారానికి పాల్పడిన రమేశ్ జుర్కిహోళిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ చేశారు.