Begin typing your search above and press return to search.

టీచర్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్

By:  Tupaki Desk   |   19 Nov 2020 3:30 PM GMT
టీచర్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్
X
మొత్తానికి టీచర్ల దెబ్బకు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 21 న జిల్లా విద్యాశాఖాధికారుల ఆఫీసుల ముందు నిర్వహించాలని అనుకున్న ఆందోళనను విరమించుకున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకటించింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపాధ్యాయుల బదిలీ నిబంధనల్లో మార్పులు, బదిలీల కౌన్సిలింగ్ ను మాన్యువల్ గా నిర్వహించాలని - ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ - ఆన్ లైన్లో విద్యార్ధుల నమోదు విషయంలో తప్పులపై హెడ్ మాస్టర్లు అప్పీలు చేస్తే పరిష్కరించాలనే డిమాండ్లు చేస్తున్నారు.

అయితే వీరి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. పైగా ఉపాద్యాయుల డిమాండ్లంటే లెక్కలేనట్లు ప్రభుత్వం వ్యవహరించింది. దాంతో ఈనెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సమాఖ్య పిలిపిచ్చింది. దాంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం డ్యామేజీ కంట్రోలులో భాగంగా వెంటనే సమాఖ్య నేతలతో సమావేశం నిర్వహించింది.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు, సమాఖ్య నేతలకు చర్చలు జరిగాయి. పాఠశాల ప్రాంత పాయింట్లను 8 నుండి 11 ఏళ్ళకు పెంచుతామని, సర్వీసు పాయింట్లను 31 ఏళ్ళకు పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. అలాటే బదిలీల కౌన్సిలింగ్ ను మాన్యువల్ గా నిర్వహించటంపైన కూడా సానుకూలంగా స్పందించింది. బదిలీలపై కొత్తగా రూపొందించిన సాఫ్ట్ వేర్ పై అందరికీ డెమో ఇస్తామన్నారు మంత్రి. అ డెమో గనుక నేతలకు నచ్చకపోతే మాన్యువల్ గానే చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో తమ నిరసనను విరమించుకున్నది సమాఖ్య.