Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల్లో కొత్త కొత్తగా మారింది ఇదేనండి

By:  Tupaki Desk   |   11 Oct 2016 6:06 AM GMT
కొత్త జిల్లాల్లో కొత్త కొత్తగా మారింది ఇదేనండి
X
ఏడాది నుంచి కొత్త జిల్లాల మీద కసరత్తు జరిగినప్పటికీ.. చివరి అంకంలో చాలానే మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి కొత్త జిల్లాలకు సంబంధించి జిల్లాల సంఖ్యను ఫైనల్ చేసే విషయంలో ఎన్ని మార్పులు చోటుచేసుకోవాలో అన్ని మార్పు చోటుచేసుకోవటాన్ని మర్చిపోలేం. పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో 23 జిల్లాలు అనుకున్నది కాస్తా చివరకు 31 జిల్లాలుగా మారిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరగటం ఒకఎత్తు అయితే.. జిల్లాల మార్పులు..చేర్పుల పుణ్యమా అని.. రెవెన్యూ డివిజన్లు..మండలాలు ఎప్పటికప్పుడు మారిపోవటం గమనార్హం.

ముందుగా అనుకున్న ప్రకారం సోమవారం మధ్యాహ్నానానికే కొత్త జిల్లాలు..వాటిల్లో ఉండే మండలాలకు సంబంధించి స్పష్టత వచ్చేస్తుందని భావించినా..అలాంటిదేమీ జరగలేదు. రాత్రి వరకూ మండలాల మార్పులు.. చేర్పులకు సంబంధించిన భారీ కసరత్తు జరిగినట్లుగా చెబుతున్నారు. సోమవారం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. అందులో.. కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంది. కానీ..అలాంటిదేమీ జరగకపోవటం తెలిసిందే. ఇక.. కొత్త జిల్లాలకు సంబంధించి చోటుచేసుకున్న మార్పుల్ని చూస్తే.. ఇవి కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.

కొత్తగా చోటు చేసుకున్న మార్పుల్ని చూస్తే..

= శంషాబాద్ (రంగారెడ్డి) జిల్లాలో షాద్ నగర్ ను.. సిద్ధిపేట జిల్లాలో హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్లుగా నిర్ణయించారు.

= నిర్మల్ జిల్లాలో పెంబి మండలాన్ని కొత్తగా చేర్చారు

= పెద్దపల్లి జిల్లా కింద గతంలో అనుకున్న రత్నాపూర్ ను తీసేసి.. రామగిరి మండలాన్ని చేశారు

= నిజామాబాద్ ఆర్మూరు డివిజన్ లో ఆలూరును అనుకున్నా అది జరగలేదు. మప్కాల్.. ఎరగట్ల మండలాల్ని ఏర్పాటు చేశారు

= కరీంనగర్ జిల్లాలో అనుకున్న వడ్లూరు మండలాన్ని ఏర్పాటు చేయలేదు. దీని స్థానే గన్నేరువరం మండలాన్ని చేర్చారు

= కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ డివిజనలో కొత్తగా నసరుల్లాబాద్‌ ను మండలంగా మార్చారు

= వరంగల్‌ ఆర్బన్ నుంచి ఇల్లంతకుంట మండలాన్ని తీసేశారు

= వరంగల్‌ రూరల్‌ లో దామెరను మండలం చేర్చారు

= ఖమ్మం రెవెన్యూ డివిజన్ లో వైరాను చేర్చారు.

= భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం డివిజన్ లో ఉన్న వెంకటాపూర్ మండలాన్ని తొలగించి మహబూబాబాద్‌ లో చేర్చారు

= మెదక్‌ జిల్లా తూప్రాన్ లో ఉన్న రామాయంపేట.. నిజాం మండలాలను మెదక్ డివిజన్ లో చేర్చారు

= సిద్దిపేట జిల్లాలో కొత్తగా హుస్నాబాద్‌ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసి మద్దూరును చేర్చారు

= జోగులాంబ (గద్వాల) జిల్లాలో అలంపూర్‌.. ఉండవెల్లిని చేర్చారు. గతంలో ఇవి రెండు వనపర్తిలో ఉండేవి

= నందిన్నె.. మాగనూర్‌.. కృష్ణా.. మక్తల్‌ ను తొలగించి మహబూబ్‌ నగర్‌ లో చేర్చారు.

= నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్‌ మండలాన్ని అనుకున్నా అలా చేయకుండా అడవిదేవులపల్లిని మండలం చేశారు

= యాదాద్రిలో కొత్తగా మోటకొండూరు మండలమైంది

= మహబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి దౌల్తాబాద్ మండలాన్ని తొలగించి వికారాబాద్‌ లో కొత్తగా చేర్చారు

= గజ్వేల్‌ డివిజన్ లో ప్రతిపాదించిన చేర్యాల.. కొమరవెల్లిని సిద్దిపేట డివిజన్‌ లోకి మార్చారు

= ఇప్పటివరకూ వనపర్తిలో ఉన్న చిన్నచింతకుంట.. మిడ్జిల్‌.. అడ్డాకుల మండలాల్ని మహబూబ్‌ నగర్‌ లో చేర్చారు

= వనపర్తి జిల్లాలో రేవెల్లి,..చిన్నంబావి.. శ్రీరంగాపూర్‌ కొత్త మండలాలను చేర్చారు.

= నాగర్‌ కర్నూలులో ఉన్న కోడేరును తీసేసి చిన్నం బావిని చేర్చారు

= నాగర్‌ కర్నూలులోని అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌ లో అనుకున్న సిద్ధాపూర్ మండలాన్ని చేర్చలేదు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/