Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుపై సినిమా వ‌స్తోంది..

By:  Tupaki Desk   |   21 July 2016 10:17 AM GMT
చంద్ర‌బాబుపై సినిమా వ‌స్తోంది..
X
ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ఇప్పుడు వెండితెర క‌థా వ‌స్తువ‌వుతున్నారు. చంద్ర‌బాబు పాల‌న ఇతివృత్తంగా సినిమా ఒక‌టి తెర‌కెక్క‌బోతుంది. ఆ సినిమాకు పేరు కూడా ఖార‌రైపోయింది. చంద్రోద‌యం పేరుతో ఇప్ప‌టికే టైటిల్ కూడా రిజిస్ట‌ర్ అయింద‌ట‌. సినిమా షూటింగ్ మొద‌లు కావ‌డ‌మే త‌రువాయి. అందుకు కూడా ముహూర్తం ఫిక్సు చేశారు. వ‌చ్చే నెల అంటే ఆగ‌స్టు 4న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మొద‌లు కానుంది.

టీడీపీలో వ‌ర్గాల్లోనూ ఇంత‌వ‌ర‌కు అంద‌రికీ తెలియ‌ని ఈ విష‌యం ఒక్క‌సారిగా బ‌య‌ట‌కొచ్చింది. చిత్రీక‌ర‌ణ ముహూర్తం ద‌గ్గ‌రైన నేప‌థ్యంలో నిర్మాత‌లు ఏర్పాట్లు వేగ‌వంతం చేయ‌డంతో విష‌యం అంద‌రికీ తెలిసింది. ఒంగోలులో ప్రారంభం కానున్న ఈ సినిమా నిర్మాణం త‌క్కువ కాలంలోనే పూర్తి కానుంద‌ట‌.

కాగా ఈ సినిమా నిర్మాణం చేప‌డుతున్న‌ది టీడీపీ నేతే. విజయవాడలో కార్పొరేట‌ర్ గా ఉన్న కాకుమాను మల్లికార్జున యాదవ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న పసుపులేటి వెంక‌ట‌ర‌మ‌ణే దీనికి క‌థ అందిస్తున్నారు. త‌మ ముఖ్య‌మంత్రిపై తీస్తున్న ఈ సినిమాకు ఉప ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప క్లాప్ కొట్టి చిత్రీక‌ర‌ణ ప్రారంభించ‌బోతున్నారు.

ఎన్టీరామారావు సినీ హీరోగా తెలుగు ప్ర‌జ‌ల అభిమానం సంపాదించుకుని టీడీపీని స్థాపించారు. టీడీపీ నేత‌ల‌కు, సినామా రంగానికి ద‌గ్గ‌ర సంబంధ‌లున్నాయి. చంద్ర‌బాబు బావ‌మ‌రిది - వియ్యంకుడు - టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ప్ర‌ముఖ హీరో - టీడీపీలోని ప‌లువురు నేత‌లు సినీ నిర్మాణంలో ఉన్నారు. అయితే.. ముఖ్య‌మంత్రి స్థాయిలో సినిమాకు సంబంధించిన వ్య‌క్తి మాత్రం ఎన్టీరామారావే. సినీ హీరోగా - ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప‌నిచేస్తే.. ఇప్పుడుముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో హీరో అనిపించుకుని సినిమా క‌థ‌నాయ‌కుడవుతున్నారు. అయితే ఈ సినిమాలో చంద్ర‌బాబుగా న‌టించేదెవ‌రో ఇంకా తెలియాల్సి ఉంది.