Begin typing your search above and press return to search.

చంద్రయాన్ 2 ఇప్పటికి ఎంతవరకూ వచ్చింది?

By:  Tupaki Desk   |   15 Aug 2019 4:59 AM GMT
చంద్రయాన్ 2 ఇప్పటికి ఎంతవరకూ వచ్చింది?
X
చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ కావటం తెలిసిందే. ఒక మోస్తరు హాలీవుడ్ చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చులో ప్రయోగించిన ఈ ప్రయోగం గత నెల 22న ఏపీలోని శ్రీహరి కోట నుంచి రోదసిలోకి ప్రయోగించటం.. ఇది విజయవంతం కావటం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు చంద్రయాన్ 2 వార్తల్లోకి వచ్చింది. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

ఇంతకాలం భూకక్ష్యలో సంచరించిన చంద్రయాన్ 2 తాజాగా మరో కీలకదశకు చేరుకుంది. భూకక్ష్య నుంచి విడవడి.. చంద్రకక్ష్య దిశగా కదులుతోంది. దీనికి తగ్గట్లే.. ఈ వ్యోమనౌకను ముందుగా అనుకున్నట్లు చంద్రకక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు వీలుగా భూమి నుంచి ఆదేశాల ద్వారా వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్ ను 1203 (దాదాపు 20 నిమిషాలకు పైనే) మండించారు. ప్రయోగం నిర్వహించిన నాటి నుంచి ఆగస్టు ఆరు మధ్య వరకూ వ్యోమనౌక కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ఇప్పటికి ఐదుసార్లు ద్రవ ఇంజిన్ ను మండించారు.

బెంగళూరు ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. చంద్రయాన్ 2 ప్రయోగం నుంచి నేటి వరకూ వ్యోమనౌకలోని అన్ని వ్యవస్థలు సరిగానే పని చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇప్పుడేం జరగనుందన్న విషయంలోకి వెళితే.. చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టిన వ్యోమనౌక.. మరోఏడు రోజులు అదే దిశలో పయనించి చంద్రుడికి దగ్గరగా వెళ్లనుంది. భూమి నుంచి పంపే సంకేతాలతో శాస్త్రవేత్తలు వ్యోమనౌక దిశను మార్పులు చేయనున్నారు. ఈ నెల 20న వ్యోమనౌక చంద్రుడికి సమీపంలో వెళ్లనుంది. ముందుగా నిర్దేశించిన దాని ప్రకారం సెప్టెంబరు 7న వ్యోమనౌక ల్యాండర్.. రోవర్ ను తీసుకెళ్లి చంద్రుని దక్షిణ ద్రువం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేయటంతో అత్యంత కీలకమైన దశను పూర్తి చేస్తుందని చెప్పాలి.