Begin typing your search above and press return to search.

బాబు అమెరికా బడాయి బట్టబయలు చేస్తున్న సంస్థ

By:  Tupaki Desk   |   8 May 2017 2:01 PM GMT
బాబు అమెరికా బడాయి బట్టబయలు చేస్తున్న సంస్థ
X
రాష్ట్రం నుంచి బయలుదేరడానికంటే ముందు నుంచే మీడియా సహకారంతో తెగ ఊదరగొట్టిన పచ్చ మీడియా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల మాత్రం మౌనం వహిస్తూ సైలెంట్ గా ఉండటం పలు విమర్శలకు తావిస్తోంది. కేవలం ఫోటోలను సాక్ష్యంగా చూపించి కోట్ల రూపాయలు పెట్టుబడిగా అమరావతికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అని చేస్తున్న ప్రచారంతో జనానికి ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కావడం లేదు. నిన్న అమెరికాలో యుఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సంస్థ పలు కంపెనీల్లో ఆకస్మిక దాడులు జరిపింది. అందులో హెచ్ వన్ బి వీసాలు దొంగతనంగా కలిగిన వాళ్ళను టార్గెట్ చేసి మరీ గుర్తించారని తెలిసింది. విచారణలో భాగంగా చేసిన దర్యాప్తులో ఆ టీం కు విస్తుపోయే సంగతులు తెలిసాయి. బోగస్ పేరుతో కార్యకలాపాలు చేస్తున్న కొన్ని కంపనీలు అమెరికా టూర్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రితో ఒప్పందాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారట. అంటే తాము ఏ కంపనీలతో ఒప్పందం చేసుకోబోతున్నమో పూర్తిగా వివరాలు కూడా తెలుసుకోకుండా బాబు బ్యాచ్ మొత్తం పోలో మని రెడీ అయ్యారు అన్నమాట. కొన్ని బ్యాంకు ఎకౌంటులు కూడా ఈ సందర్భంగా సీజ్ చేసి వాటి మీద కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న బాబు వీలైనంత మేర తన వచ్చి రాని ఇంగ్లీష్ తో మాటల గారడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఎన్ఆర్ఐ లను ఉద్దేశించి ఒక చోట మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ఇంత బాగా మెరుగుపడడానికి తాను చేసిన కృషి ఎంతో ఉందని చెప్పడం ఇప్పటికే కామెడీ టాపిక్ గా మారింది. నిన్న కొన్ని కంపనీలతో ఒప్పందం చేసుకున్నట్టు ఆయా ప్రతినిధులతో దిగిన ఫోటోలు బాగా పరిశీలిస్తే అందులో ఉన్న వాళ్ళు గతంలో హైదరాబాద్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో ఐటి కంపెనీలు పెట్టి బోర్డ్ తిప్పేసిన బాపతు అని తేలింది. కాని ఇది నిజమని ఇంకా నిర్ధారణ కాలేదు. నిన్న ఆ సంస్థ చేపట్టిన దాడుల్లో కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వైజాగ్ సమ్మిట్ లో పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని వెంకయ్య నాయుడు సాక్షిగా ప్రకటించుకున్న బాబు సర్కార్ ఆ తర్వాత వాటి గురించి ఎక్కడ కనీసం ప్రస్తావించడం లేదు. ఇప్పుడు చేస్తున్న అమెరికా జాతర కూడా అలాంటిదే అని నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. దానికి తోడు ఈ రోజు ఉదయం బాకా పత్రికలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే దాడులు చేయించారు అని చవకబారు ప్రచారం కూడా మొదలుపెట్టడం దీనికి పరాకాష్ట. మొత్తానికి బాబు గారి అమెరికా యాత్ర ఎన్ని పెట్టుబడులు తెస్తుందో వచ్చాక కాని అర్థం కాదు. అంకెల గారడితో బురిడి కొట్టించే లెక్కలు సామాన్యుడికి అర్థం కానంత వరకు ఎన్ని చెప్పినా చెల్లుతాయి.