Begin typing your search above and press return to search.

జీఎన్ రావు పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   1 Jan 2020 10:02 AM GMT
జీఎన్ రావు పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
X
ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్నసీనియర్‌ ఏఐఎస్‌ జీఎన్‌ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపధ్యం లో ఆ కమిటీ రాజధాని అంశం పై నివేదిక ఇచ్చింది. ఆ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు పనికిమాలిన ఆయన పేరుతో కమిటీ వేశారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే సీనియర్‌ అధికారి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అని కూడా చూడకుండా జీఎన్‌ రావు పై చంద్రబాబు నోరుపారేసుకున్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి విషయమై ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక లో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

అమరావతిలో 10వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పిన చంద్రబాబు భూముల ధరలు పెరిగితే మీకు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్ విషయంలో అదే జరిగిందని ఆయన గుర్తు చేశారు. భూములు అమ్ముకోవద్దని హైటెక్‌ సిటి నిర్మించక ముందు చెప్పానన్న చంద్రబాబు హైటెక్‌ సిటి నిర్మించాక ఎకరం 30కోట్లు అమ్ముడు పోయిందని గుర్తుచేశారు. అభివృద్ధి చేశాక భూముల ధరలు పెరగడం సహజం అని గుర్తు చేశారు.

మొత్తానికి రాజధాని వ్యవహారం పై జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్‌ అధికారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ , అటు అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశం గా మారాయి. ఈ రోజు రాజధాని ప్రాంతంలో ఉన్న ఎర్రబాలెం లో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన చంద్రబాబు దీక్ష లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.