Begin typing your search above and press return to search.
చంద్రబాబు వర్సెస్ ఫోన్ ట్యాపింగ్.. లాజిక్ మిస్ అయ్యాడా?
By: Tupaki Desk | 25 Aug 2020 12:00 PM IST40 ఇయర్స్ పాలిటిక్స్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఏమి చేసినా కొంచెం లాజిక్ తో చేస్తాడు కానీ.. ఈ మధ్య లాజిక్ మిస్ అవుతున్నాడంట.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గాలి వార్తలు నమ్మి మోడీకి లెటర్ రాసి అభాసుపాలయ్యాడని వైసీపీ కౌంటర్ ఇస్తోంది.
ప్రతీ విషయంలోనూ లాజిక్ గా ఆలోచించే చంద్రబాబు లాజిక్ మిస్ అయ్యాడని అర్థమవుతోంది. లెటర్ రాశాడు కానీ ఎవరి ఫోన్ ట్యాప్ చేశారని చంద్రబాబు చెప్పడం లేదు... చంద్రబాబుకు అనుకూలంగా ఉండే కొందరు లాయర్లు.. జడ్జీల ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని హైకోర్టులో పిల్ వేశారు. కానీ ఇందులో మోడీకి చంద్రబాబు రాసిన లెటర్ డీటైల్స్ ఏమీ లేకుండానే పిల్ వేశారు.
ఏపీ డీజీపీ దీనిపై చంద్రబాబుకు లేఖ రాసి డిటైల్స్ ఇవ్వండని.. మేము విచారణ చేస్తామని చెప్పినా ఇంతవరకు చంద్రబాబు స్పందించలేదు. రెస్పాండ్ కాకుండా.. డీటైల్స్ ఇవ్వకుండా సైలెంట్ అయ్యాడు. దీన్ని బట్టి టీడీపీ అనుకూల మీడియా సృష్టించిన గాలి వార్తలను సీరియస్ చేద్దామని.. జాతీయ మీడియాను మేనేజ్ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేద్దామని చంద్రబాబు ప్లాన్ చేశాడు కావచ్చు అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
ఆధారాలు లేకుండా ఆరోపించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మోడీకి లేఖ రాసిన చంద్రబాబును ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆధారాలు అడిగితే ఏమీ చేస్తాడనే చర్చ కూడా మొదలైంది. మొత్తానికి టీడీపీ అనుకూల మీడియా అధిపతి ఏమి చెబితే అదే చంద్రబాబు గుడ్డిగా చేస్తున్నాడనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. గత ఎన్నికల్లో ఆ మీడియా అధిపతి చెత్త ఐడియాల వల్లే బాబు ఓడిపోయాడని.. ఇప్పుడు ఆయన మాట నమ్మే బాబు ముందుకెళుతున్నారని.. మరింతగా పతనం అవ్వక తప్పదని టీడీపీ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట..