Begin typing your search above and press return to search.

ఇదే నిజ‌మైతే.. చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే!

By:  Tupaki Desk   |   9 Sep 2022 5:30 PM GMT
ఇదే నిజ‌మైతే.. చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు దూర‌దృష్టి ఎక్కువ‌. అదేవిధంగా ఆయ‌న స‌హ‌న‌శీలి అనే పేరు కూడా తెచ్చుకున్నారు. ముఖ్యంగా పార్టీ విష‌యంలోనూ.. నాయ‌కుల విష‌యంలోనూ.. ఆయ‌న ఆచితూచి అడు గులు వేస్తారు. ఎవ‌రైనా త‌ప్పులుచేసినా.. స‌రిదిద్దుకోమ‌ని ఛాన్స్ ఇస్తారు. కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అయితే.. తాజాగా చంద్ర‌బాబు వెల్ల‌డించిన ఓ విష యం.. అత్యంత సీరియ‌స్‌గా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కొన్ని జిల్లాల్లో నాయ‌కులు వ్య‌వ‌హరిస్తున్న తీరుపై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. వాస్త‌వానికి .. గ‌త మూడేళ్ల నుంచి టీడీపీ అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మా లు చేస్తోంది. ఆయా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని.. స్వ‌యంగా చంద్ర‌బాబు పిలుపునిస్తున్నారు. అయిన‌ప్ప టికీ.. కొందరు పాల్గొంటున్నారు. మ‌రికొంద‌రు న‌టిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇంకొంద‌రు అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రి వ్యాపారాలు.. వ్య‌వ‌హారాల్లోవారు మునిగిపోతున్నారు.

అయినా.. కూడా చంద్ర‌బాబు స‌హిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఒక విష‌యం.. ఆయ‌న దాకా వ‌చ్చింది. దీనిపై ఆయ‌న సొంత‌గానే స‌మాచారం తెప్పించుకున్నారు. ఎవ‌రో ఏదో చెబితే..న‌మ్మేయ‌డం క‌న్నా.. సొంత‌గానే స‌మాచారం తెప్పించుకోవాల‌ని.. భావించిన చంద్ర‌బాబు ఆదిశ‌గానే అడుగులు వేశారు. ఈ క్ర‌మంలో తెప్పించుకున్న స‌మాచారం.. తెలిసి.. చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హానికి గురయ్యారు. కృష్ణా, అనంత‌పురం, చిత్తూరు, క‌ర్నూలు, గుంటూరు జిల్లాల్లోని టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆయ‌న నిప్పులు చెరిగారు.

ఇంత‌కీ.. ఆయా జిల్లాల్లోని నాయ‌కులు ఏం చేస్తున్నారంటే.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ఏదైనా ఉద్య‌మానికి పిలుపు ఇవ్వ‌గానే.. స‌ద‌రు నాయ‌కులు.. బ‌య‌ట‌కు రాకుండా.. ఇంట్లోనే ఉండిపోతున్నారు. దీనికివారు.. చెబుతున్న రీజ‌న్‌.. త‌మ‌ను పోలీసులు నిర్బంధించారు.

అందుకే రాలేక‌పోయాం.. ఏమీ చేయ‌లేక‌పోతున్నాం..అని స‌మాచారం ఇస్తున్నారు. అయితే.. దీనిపై చంద్ర‌బాబు కు ఫిర్యాదులు అందాయి. ఉద్దేశ పూర్వ‌కంగా నేత‌లే.. ముందుగా పోలీసుల‌కు స‌మాచారం చేర‌వేసి.. త‌మ‌ను గృహ నిర్బంధం చేసేలా.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. తెలిసింది.

దీంతో చంద్ర‌బాబు తాజాగా ఆయా జిల్లాల నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు. మీరు చేస్తున్న నాట‌కాలు అన్నీ నాకు తెలుసు.. అంటూ.. వ్యాఖ్యానించారు. ఇక‌మీద‌ట ఇలా చేస్తే.. ఊరుకునేది లేద‌ని.. తేల్చిచెప్పార‌ట‌. అంతేకాదు..ర‌హ‌స్యంగా వ‌స్తున్న స‌మాచారం కూడా పోలీసులకు ముందుగానే ఎలా తెలుస్తోంద‌ని..కృష్ణాజిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీని నిల‌దీసిన‌ట్టు స‌మాచారం. దీనికి ఆయ‌న నీళ్లున‌మ‌ల‌డంతో చంద్ర‌బాబు మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఇష్టం లేక‌పోతే.. పార్టీ నుంచి వెళ్లిపోవ‌చ్చ‌ని తెగేసి చెప్పార‌ట‌. ఇదీ .. సంగ‌తి!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.