Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పేరు మార్పుపై చంద్రబాబు రియాక్షన్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   21 Sep 2022 8:26 AM GMT
ఎన్టీఆర్ పేరు మార్పుపై చంద్రబాబు రియాక్షన్ వచ్చేసింది
X
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును పెడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిందే. అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రియాక్టు అయ్యారు.

పేరు మార్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 1986లోఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్సార్ కు ఎలాంటి సంబంధం ఉందని ప్రశ్నించారు.

ఉన్న సంస్థలకు పేర్లు మారిస్తే పేరు రాదని.. కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావు? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరును కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ పేరు మార్పును టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న ఆయన.. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ వర్సిటీని స్టార్ట్ చేశారన్నారు. ఆయన మరణం తర్వాత 1988లో తమ ప్రభుత్వం ఆ సంస్థకు ఎన్టీఆర్ పేరును పెట్టిన వైనాన్ని గుర్తు చేశారు.

36 ఏళ్ల క్రితం ప్రారంభమైన యూనివర్సిటీకి ఇప్పుడు పేరు తీసేసి.. కొత్త పేరు (వైఎస్సార్) పెట్టటంలో అర్థం లేదన్నారు. "దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు.

వ్యవస్థలను.. సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుందనే విషయాన్ని సీఎం జగన్ తెలుసుకోవాలి. ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. మరి.. దీనికి సీఎం జగన్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.