Begin typing your search above and press return to search.

ఇదేం చిత్రం త‌మ్ముళ్లూ.. నిర‌స‌న‌ల్లో బ‌ల ప్ర‌ద‌ర్శ‌నా...?

By:  Tupaki Desk   |   10 Nov 2021 1:30 PM GMT
ఇదేం చిత్రం త‌మ్ముళ్లూ.. నిర‌స‌న‌ల్లో బ‌ల ప్ర‌ద‌ర్శ‌నా...?
X
టీడీపీ నేత‌లకు దూకుడు ఎక్కువైంద‌నే టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారంలోకి రావాల‌ని.. ఒక‌వైపు పార్టీ అధినేత చంద్ర‌బాబు.. ఎండ‌న‌క‌.. వాన‌న‌క‌.. రేయ‌న‌క‌.. ప‌గ‌ల‌న‌క‌.. పాటు ప‌డుతున్నారు. ప్ర‌భుత్వంపై ఒంటికాలుతో ఉద్య‌మం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. త‌న రాజ‌కీయ జీవితంలోనే తీవ్రంగా విభేదించిన‌.. బంద్‌ల‌కు కూడా ఆయ‌న పిలుపునిస్తున్నారు. మ‌రి ఇంత చేస్తున్న‌.. బాబును అనుస‌రించాల్సింది పోయి.. త‌మ్ముళ్లు చాలా చోట్ల‌.. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను త‌మ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌గా మారుస్తున్నార‌నే వాద‌న‌.. విమ‌ర్శ‌లు టీడీపీలోనే వినిపిస్తున్నాయి.

తాజాగా జ‌రిగిన పెట్రోల్ నిర‌స‌న దీనికి వేదిక‌గా మారింద‌నే గుస‌గుస‌లు ఠారెత్తుతున్నాయి. విజ‌య‌వాడ‌, గుంటూరు జిల్లాల్లో జ‌రిగిన నిర‌స‌న‌ల్లో చాలా మంది నాయ‌కులు త‌మ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ను పోటా పోటీగా నిర్వ‌హించారు. ప్ర‌త్యేకంగా వారి పేర్ల‌తో బ్యాన‌ర్లు రాయించుకున్నారు. పెద్ద ఎత్తున త‌మ త‌మ ఫొటోలు వేయించుకున్నారు. మందీ మార్బ‌లాన్నీ రంగంలోకి దింపారు. అయితే.. ఇదంతా త‌ప్పుకాదు.. ప్ర‌భుత్వం పై నిర‌స‌న వ్య‌క్తం చేయాలి కాబ‌ట్టి.. బ్యాన‌ర్లు క‌ట్టాలి. జ‌నాల‌ను కూడా త‌ర‌లించాలి.

అయితే.. ఈ క్ర‌మం లో పార్టీ కి.. పార్టీ అధినేత‌కు వాల్యూ ఇవ్వాలి క‌దా! అది వ‌దిలేసి బ్యాన‌ర్ల‌పై త‌మ ఫొటోల‌ను పెద్ద ఎత్తున వేయించుకోవ‌డంతోపాటు.. త‌మ పేర్ల‌ను ముద్రించుకుని.. త‌మ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలంటూ.. స్లోగ‌న్లు రాయించుకున్నారు. అంతేకాదు.. నిర‌స‌న‌ల్లో పాల్గొన్న‌వారితో త‌మ పేరిటే భ‌జ‌న చేయించుకున్నారు. దీనికితోడు.. ఈ నిర‌స‌న‌ల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి వ‌చ్చిన కొంద‌రు విలేక‌రుల‌ను కూడా త‌మ పేర్లు వ‌చ్చేలా చూడాలంటూ.. కొంద‌రు నాయ‌కులు పోటీప‌డి మ‌రీ కోర‌డం.. చిత్రంగా అనిపించింది.

స‌బ్జెక్ట్ బాగుంటే.. ప‌త్రిక‌లే నేత‌ల పేర్లు రాస్తాయి. దీనికి ఎవ‌రూ అడ‌గాల్సిన అవ‌స‌రంలేదు. కానీ.. టీడీపీ నాయ‌కులు .. ఎందుకో.. అతి చేశార‌ని.. పార్టీ అధినేత చెప్పిన లైన్‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించార‌నే టాక్ మాత్రం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఎక్క‌డిక‌క్క‌డ పెద్ద ఎత్తున బ్యాన‌ర్లు వేయించుకుని.. త‌మ పేర్లు రాయించుకున్న తీరు చూసిన వారు.. ఇప్పుడేమైనా..ఎన్నిక‌లు ఉన్నాయా? ఇదేంటి? అని ముఖం చిట్లించి చూడ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.