Begin typing your search above and press return to search.

బ‌ద్వేల్‌పై బాబు వ్యూహం ఏంటి?

By:  Tupaki Desk   |   28 Sep 2021 9:36 AM GMT
బ‌ద్వేల్‌పై బాబు వ్యూహం ఏంటి?
X
ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నికకు సంబం ధించి.. షెడ్యూల్ వ‌చ్చింది. అక్టోబ‌రు 1 నుంచి ఉప పోరుకు సంబంధించిన నామినేష‌న్లు ప్రారంభం కాను న్నాయి. అదే నెల 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికార పార్టీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం టీడీపీ ఇక్క‌డ ఏం చేస్తుంది? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఈ ఏడాది జ‌రిగిన తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నికలో విజ‌యం దిశ‌గా అడుగులు వేసినటీడీపీ.. చివ‌ర‌కు వ‌చ్చే స‌రికి.. వైసీపీకి మెజారిటీ త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము పావులు క‌దిపామ‌ని.. ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యామ‌ని పేర్కొంది.

మ‌రి ఇప్పుడు బద్వేల్ విష‌యంలో ఏం చేస్తుంది? గ‌త రెండు ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. 2014, 2019 ఎన్నిక ల్లో ఇక్క‌డ పార్టీ ప‌రాజ‌యం పాలైంది. అంతేకాదు.. 2014లో తెచ్చుకున్న ఓట్ల‌కు, గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల‌కు కూడా భారీ తేడా ఉంది. ఐదేళ్ల పాల‌న‌లో.. పార్టీ మెరుగు ప‌డాల్సిందిపోయి.. ఓట్ల శాతం త‌గ్గించుకుం ది. ఇది పార్టీకి ప్ర‌ధాన మైన‌స్‌గా మారిపోయింది. దీనికితోడు.. 2014లొ వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకు న్న తిరువీధి జ‌య‌రాముల‌ను ప‌ట్టుబ‌ట్టి పార్టీలోకి తీసుకున్నారు.కానీ, ప్ర‌యోజ‌నం క‌నిపించ లేదు. గత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టినా.. ప‌క్క‌న పెట్టారు.

ఓబులాపురం రాజ‌శేఖ‌ర్‌ను ఇక్క‌డ నిల‌బెట్టారు. ఈయ‌న ప్ర‌జ‌ల సానుభూతిని పొంద‌లేక పోయారు. ఫ‌లితంగా 2014 కంటే కూడా.. త‌క్కువ‌గానే టీడీపీకి ఓట్లు పోల‌య్యాయి. దీంతో ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అయినా.. చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి క‌దా.. అభ్య‌ర్థిని మార్చాలి క‌దా.. కానీ, ఆయ‌న మ‌ళ్లీ రాజ‌శేఖ‌ర్‌కే టికెట్ ప్ర‌క‌టించారు. అంటే..తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం మాదిరిగానే .. సో.. దీనిని బ‌ట్టి.. ఇప్ప‌టికే ఫ‌లితంపై ఒక అంచ‌నా వ‌చ్చేసింది. నిజానికి నామినేష‌న్లు ప‌డ్డ‌త‌ర్వాత‌.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వ‌చ్చే అంచ‌నా ఇప్పుడే రావ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది? పార్టీని ఇక్క‌డ గెలిపించుకోవ‌డం కోసం.. ప్ర‌య‌త్నిస్తుందా? లేక‌.. తిరుప‌తి ఉప పోరు మాదిరిగానే అధికార పార్టీ అభ్య‌ర్థి.. మెజారిటీని త‌గ్గించ‌డం వ‌ర‌కే ప‌రిమితం అవుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు 1985, 1994, 1999 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే పార్టీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. గ‌త ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో ఇక్క‌డ ప్ర‌త్యేక అభివృద్ధి చేసినా.. నాయ‌కుల మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య పోరు.. కార‌ణంగా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేదు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారు? అనేది చూడాలి. అదేస‌మ‌యంలో ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను మ‌ళ్లీ లోకేష్‌కే అప్ప‌గిస్తారా? లేక‌.. స్థానిక నాయ‌కుల‌కు క‌ట్ట‌బెడ‌తారా? ఇవ‌న్నీ .. కాక‌.. త‌నే స్వ‌యంగా చంద్ర‌బాబు రంగంలోకి దిగుతారా? చూడాలి.