Begin typing your search above and press return to search.

వారంలో ఒక్క రోజే ఉన్న బాబు..!

By:  Tupaki Desk   |   24 Aug 2015 2:33 PM IST
వారంలో ఒక్క రోజే ఉన్న బాబు..!
X
బాబులో మార్పు వచ్చేస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ హైద‌రాబాద్ వ‌దిలి వెళ్లేందుకు ఏ మాత్రం సుముఖ‌త చూప‌ని ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌న ఏపీలో ఉండేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. వారంలో ఐదు రోజులు ఏపీలోనే ఉంటాన‌ని చెప్పిన ఆయ‌న‌.. గ‌త వారం ఆరు రోజులు ఏపీలో గ‌డ‌ప‌టం గ‌మ‌నార్హం.

హైద‌రాబాద్‌ లోని ఏపీ శాఖ‌లన్నింటిని యుద్ధ ప్రాతిప‌దిక‌న త‌ర‌లించాల‌ని భావిస్తున్న చంద్ర‌బాబు.. అందులో భాగంగా తానే అంద‌రికి ఆద‌ర్శంగా ఉండాల‌న్న‌ట్లుగా ఆయ‌న వైఖ‌రి ఉంది. గ‌త సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరిన ఆయ‌న క‌ర్నూలు.. క‌డ‌ప జిల్లాల్లో ప‌ర్య‌టించ‌టం.. అటు నుంచి అటే విజ‌య‌వాడ వెళ్లిపోవ‌టం తెలిసిందే. శ‌నివారం వ‌ర‌కూ విజ‌య‌వాడ‌లోనే గ‌డిపిన ఆయ‌న‌.. ఆదివారం మాత్రం హైద‌రాబాద్ చేరుకున్నారు.

సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరిన ఆయ‌న‌..సోమ‌వారం ఉద‌య‌మే విజ‌య‌వాడ‌కు చేరుకొని.. మంగ‌ళవారం ప్ర‌ధాని మోడీతో భేటీకి సంబంధించిన క‌స‌ర‌త్తులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఢిల్లీ వెళుతున్న సంద‌ర్భంగా ఆయ‌న‌.. త‌న ప్ర‌యాణాన్ని గ‌న్న‌వ‌రం నుంచి ఢిల్లీ.. తిరిగి ఢిల్లీ నుంచి గ‌న్న‌వ‌రం వ‌చ్చేలా ప్లాన్ చేసుకున్నారు. అధికార గ‌ణం మొత్తాన్ని హైద‌రాబాద్ వ‌దిలిపెట్టాల‌ని చెప్పే బాబు.. తొలుత తానే అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తూ.. విజ‌య‌వాడ‌లో మ‌కాం వేయ‌టం మంచి ప‌రిణామంగా చెప్పొచ్చు.