Begin typing your search above and press return to search.

మోడీ అపాయింట్ మెంట్ దొరుకుతుందా?

By:  Tupaki Desk   |   10 Aug 2015 10:04 AM IST
మోడీ అపాయింట్ మెంట్ దొరుకుతుందా?
X
ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ.. శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరుసభ లో ఏపీ కాంగ్రెస్ కార్యకర్త మునికోటి తిరుపతిలో ఆత్మహత్యా యత్నం చేసుకోవటం తెలిసిందే. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకొని తగలబెట్టుకోవటం.. అతన్ని మొదట రుయాకు.. అనంతరం వేలూరు లోని సీఎంసీకి తరలించారు. అయినా.. ఫలితం దక్కని పరిస్థితి.

మునికోటి ఆత్మహత్యా యత్నం చేసుకున్న కాసేపటికే.. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు గా టీవీల్లో స్కోలింగ్ లు వచ్చాయి. ఆగస్టు 16 నుంచి 19 లోపు కచ్ఛితంగా ప్రధానిని కలుస్తారని.. ఏపీకి ప్రత్యేకహోదా విషయంపై చర్చిస్తారన్న ధీమాను తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేశారు.

వాస్తవ పరిస్థితి చూస్తుంటే.. బాబుకు అంత సీన్ ఉన్నట్లుగా కనిపించటం లేదు. ఎందుకంటే.. ఆగస్టు 15 కార్యక్రమం తర్వాత.. ఆ తర్వాతి రోజు అంటే.. ఆగస్టు 16న యూఏఈ దేశాల పర్యటనకు వెళుతున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని పీఎంవో విడుదల చేసిందని చెబుతున్నారు. అలాంటిది జరిగినప్పుడు.. మోడీ తిరిగి వచ్చేసరికి 18 అవుతుందని.. మరి.. ఆ సమయానికి బాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ముందుగా చెప్పినట్లు.. భేటీ కాకుండా డ్యామేజ్ భారీగా జరిగే అవకాశం ఉంటే.. తప్పనిసరిగా మోడీ ని బాబు కలుస్తారని చెబుతున్నారు. ప్రధాని అపాయింట్ మెంట్ కోసమే ఇంత కిందామీదా పడుతుంటే.. ఇక ఏపీకి ప్రత్యేక హోదా అన్న డిమాండ్ సాధనకు మరెంత కష్టపడాలో..?