Begin typing your search above and press return to search.
ఇక.. బాబు వీకెండ్ బస మాత్రమే
By: Tupaki Desk | 16 Aug 2015 9:59 AM ISTహైదరాబాద్ మహానగరం పట్ల విపరీతమైన మోజును ప్రదర్శించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. భాగ్యనగరిని విడిచిపెట్టి ఉండటానికి పెద్దగా ఇష్టపడే వారు కాదు. పేరుకు ఏపీ ముఖ్యమంత్రి అయినా.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచే విషయాల్ని మేనేజ్ చేయాలని భావించే వారు.
పద్నాలుగు నెలలుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన భాగ్యనగరి మీద చూపించే ప్రేమాభిమానాలు ఏపీ మీద చూపించటం లేదన్న ఫిర్యాదుతో పాటు.. తనది కాని స్థానంలో ఉంటే తనకుంటే మర్యాద ఎంతన్న విషయాన్ని.. ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతంతో అర్థం చేసుకన్న ఆయన.. హైదరాబాద్ లో ఉండేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు.
గోదావరి పుష్కరాల నుంచి ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాజాగా చూస్తే.. వారం కిందట హైదరాబాద్ నుంచి ఏపీ పర్యటనకు వెళ్లిన ఆయన గత ఏడు రోజులుగా ఆయన ఏపీలోనే ఉండిపోయారు. శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన.. ఆదివారం హైదరాబాద్ లో ఉండిపోనున్నారు. మళ్లీ సోమవారం కర్నూలు జిల్లా.. అనంతరం రెండు రోజులు చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.
వారంలో ఐదారు రోజుల పాటు ఏపీలోనే ఉండాలని డిసైడ్ అయిన చంద్రబాబు.. ఇకపై హైదారాబాద్ కు వీకెండ్ లలో మాత్రమే వచ్చే వీలుందని చెబుతున్నారు. ఐటీ ఉద్యోగులు కనుక వారం మొత్తం పని చేసి.. వారాంతంలో అయితే ఇంటికి లేదంటే.. బంధువులు.. చుట్టాల ఇళ్లకు వెళ్లి.. మళ్లీ సోమవారం ఉదయం నాటికి హైదరాబాద్ కు చేరుకున్నట్లే.. బాబు కూడా శనివారం రాత్రికి హైదరాబాద్ రావటం.. సోమవారం ఉదయమే వెళ్లిపోయే అవకాశమే ఎక్కువంటున్నారు.