Begin typing your search above and press return to search.
కౌంట్ డౌన్ మొదలయిందంటున్న బాబు
By: Tupaki Desk | 17 May 2017 12:25 PM ISTముందస్తు ఎన్నికలు ఉంటాయని జోస్యం చెప్తూ శ్రేణులను అలర్ట్ చేసిన టీడీపీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు పార్టీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు హెచ్చరికలు జారీ చేశారు. హితబోధ- సూచన- రాజకీయం మేళవిస్తూ బాబు క్లాస్ తీసుకున్నారు. ఇందుకు జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ - శాసనమండలి సమావేశం అయ్యే ప్రత్యేక రోజు వేదికగా నిలిచింది. శాసనసభ సమావేశం అనంతరం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన బాబు పార్టీ నేతల - ఎమ్మెల్యేల పనితీరుపై కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపులో ఐవీఆర్ ఎస్ ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ నేతలే కాకుండా చివరికి తన పనితీరు మీద కూడా అభిప్రాయ సేకరణ చేస్తానని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను చివరకు మంత్రులు కూడా సరిగా అధ్యయనం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు ఓనర్ షిప్ తీసుకునే విషయంలో వెనుకబడ్డామని మంత్రులకు - ఎమ్మెల్యేలకు వివరించారు. తీసుకున్న నిర్ణయాలు పక్కాగా అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తే దీనిలో కూడా కొందరు తప్పులు చేశారన్నారు. ఉచిత ఇసుక వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు, ఇబ్బందులు వచ్చేలా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు తప్పు చేసిన ఆ ప్రభావం తనతో పాటు పార్టీ మీద పడుతున్న విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో నేతలు మమేకం కావాడం లేదని పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం చేయాల్సిన బాధ్యత తనకెంత ఉందో ఎమ్మెల్యేలకు కూడా అంతే ఉందని చెప్పారు.
నియోజకవర్గాల అభివృద్ధికి కావాల్సినని నిధులు ఇస్తానని కానీ పనులు సమర్థవంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదని చంద్రబాబు పేర్కొన్నారు. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో వంద శాతం వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు నీరు-ప్రగతి కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇకనైనా ఈ విషయంలో సరిగా వ్యవహారించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.12 వేల కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఎన్నో ఇబ్బందులు ఉన్న వాటన్నింటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ ఉనికి కోల్పోతామని ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆందోళన చెందుతుందని అందుకే దీనిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుందని ఎమ్మె ల్యేలకు, ఎమ్మెల్సీలకు తెలిపారు. ఎకరానికి రూ.10 లక్షలకు పైగా నష్టపరిహారం నిర్వాసితులకు చెల్లిస్తున్నామని అయితే ఈ డబ్బును వారు సద్వినియోగం చేసుకునేలా అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత నేతలదేనని స్పష్టం చేశారు.
పార్టీ పరంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సమర్ధులకే కమిటీల్లో స్థానం కల్పించాలని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మత్య్సకారులకు ఫించన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. అయితే దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కాగా, టీడీఎల్పీ సమావేశానికి తాను వచ్చినా సమయానికి రాకుండా లాబీల్లో చక్కర్లు కొడుతున్న ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. సమావేశానికి హజరు కాకుండా లాబీల్లో తిరిగితే ఎలా అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెత్తనాలు చేయడం కాదని పనిని సక్రమంగా నిర్వహించాలని బాబు మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/