Begin typing your search above and press return to search.
తమ్ముళ్లు అలా చేస్తే టెన్ మినిట్స్ లో వేటేనట
By: Tupaki Desk | 3 April 2017 1:10 PM ISTఎన్నో ప్లాన్లు వేసుకొని.. కిందామీదా తర్జనభర్జనల అనంతరం మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని రీతిలో పార్టీ నేతల అసంతృప్తి రాగం వినిపించటం.. కొందరు నేతలు బాహాటంగానే తమ ఆగ్రహాన్ని మీడియా ముందు వ్యక్తం చేయటం తెలిసిందే. క్రమశిక్షణకు మారుపేరుగా.. లోపల ఎంత అసంతృప్తి మంట పుడుతున్నా.. పైకి మాత్రం అంతా బాగున్నట్లుగా ఉండే పరిస్థితులు గతంలో ఉండేవి. అధినేత చంద్రబాబుపై లోన ఎంత అసంతృప్తి ఉన్నా.. ఆ విషయం బయటకు పొక్కటానికి తెలుగు తమ్ముళ్లే ఏ మాత్రం ఇష్టపడే వారు కాదు. అలాంటిది.. అందుకు భిన్నంగా బొండా ఉమ లాంటి జూనియర్ ఎమ్మెల్యేలు సైతం తమ అసంతృప్తిని ఓపెన్ గా వ్యక్తం చేయటం పార్టీ వర్గాలకు విస్మయంగా మారింది.
మంత్రివర్గ విస్తరణ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. ఈ రోజు ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. నేతలు ఏదైనా అసంతృప్తి ఉంటే తనకు నేరుగా చెప్పాలే కానీ మీడియాకు ఎక్కటం ఏ మాత్రం సరికాదన్న మాటను చెప్పటమే కాదు.. ఆదివారం నేతలు కొందరు వ్యవహరించిన వ్యవహారశైలి తనను బాధించినట్లుగా బాబు చెప్పారు.
అదే సమయంలో.. ఈ తీరును మార్చుకోవాలని.. పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తే.. నేతలు ఎంతటి వారైనా సరే.. వారిపై కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికను జారీ చేశారు. నిన్నటి మాదిరి ఈ రోజు నిరసనలు వ్యక్తం చేస్తే.. అలాంటి వారు ఏ స్థాయిలో ఉన్నా.. టెన్ మినిట్స్ లో వారిపై వేటు తప్పదన్న వార్నింగ్‌ను చంద్రబాబు ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే తాను సహించనని చెప్పిన ఆయన.. అన్ని ప్రాంతాలు.. వర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేపథ్యంలో కొందరికి అర్హత ఉన్నా.. పదవులు ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందన్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో 26 మందికి మించి ఇవ్వలేమన్న చంద్రబాబు మాటలపై టీడీపీ తమ్ముళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందన్న ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే.. బాబు వార్నింగ్ కిందిస్థాయి నేతల మీద పెద్ద ప్రభావం చూపినట్లుగా కనిపించటం లేదు. రాజమండ్రి పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశాలు ఇవాళ జరగాల్సి ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్ని ఈ రోజు నిర్వహించాల్సి ఉన్నా.. తమ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయటం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడిన కౌన్సిల్ నేతలు.. బాబు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
36 ఏళ్లుగా పార్టీకి పని చేసి.. పార్టీ ప్రతి కార్యక్రమంలో తనదైన ముద్రవేసిన బుచ్చయ్య చౌదరి లాంటి నేతను మంత్రివర్గంలో తీసుకోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. నాలుగుసార్లు గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వరా? అంటూ ప్రశ్నించిన వారు.. బుచ్చయ్య చౌదరి మీద పోటీ చేసిన వ్యక్తికి పదవులు ఇస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ రోజురోజుకీ దిగజారిపోతుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ప్రవర్తించే వారు ఎవరైనా సరే.. టెన్ మినిట్స్ లో వేటు వేస్తామన్న బాబు మాట ఎంతవరకూ అమలు అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/