Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసులో బాబుకు ఊరట

By:  Tupaki Desk   |   9 Dec 2016 8:05 AM GMT
ఓటుకు నోటు కేసులో బాబుకు ఊరట
X
ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊరట లభించింది. క్యాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఉత్తర్వులను హైకోర్టు కోట్టివేస్తూ తీర్పు చెప్పింది. విచారణ అవసరం లేదన్న చంద్రబాబు న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

కాగా ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తుతో విభేదించకపోయినా చంద్రబాబుపై విచారణ చేయాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను మాత్రం హైకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. . కాగా, చంద్రబాబుపై విచారణ కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలను తోసిపుచ్చింది.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వంతో తలనొప్పులు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఓటుకు నోటు కేసుతో పూర్తిగా డిఫెన్సులో పడ్డారు. అయితే.. లోపాయికారీ ఒప్పందాలతో ఓటుకు నోటు కేసును నీరుగార్చి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇబ్బంది లేకుండా చూసుకున్నా వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాత్రం దీన్ని విడిచిపెట్టలేదు. చంద్రబాబుపై విచారణ చేయించాలని కోరారు. అయితే... హైకోర్టు మాత్రం ఆ అవసరం లేదంది. మరి.. రామకృష్ణారెడ్డి దీన్ని ఇక్కడితో వదిలేస్తారో లేదంటే ఇంకేమైనా న్యాయ పోరాటం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.