Begin typing your search above and press return to search.

మారిపోయిందిః బాబు విజ‌న్ 2020 కాదు

By:  Tupaki Desk   |   13 Nov 2015 3:10 PM IST
మారిపోయిందిః బాబు విజ‌న్ 2020 కాదు
X
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటే టెక్నాల‌జీ సీఎంగా, విజ‌న్ 2020 రూప‌కర్త‌గా పాపుల‌ర్‌. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో రూపొందించిన ఆ విజ‌న్ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ఎలా స‌రిపోతుంది అనుకున్నారో లేదా రాష్ర్ట ప‌రిస్థితుల రీత్యానో కావ‌చ్చు కొత్త‌ డెడ్‌ లైన్ ఫిక్స్ చేశారు.

తిరుపతిలో తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశ సదస్సు ప్రారంభమైంది. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంలో పార్టీ పాత్ర అనే అంశంపై చర్చించనున్న ఈ సదస్సును చంద్ర‌బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే క్ర‌మంలో చంద్రబాబు ప్ర‌సంగించారు. పార్టీని, ప్రజలను అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయామని రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు చంద్ర‌బాబు తెలిపారు. ఆదాయాలు పెంచుకునేందుకు అన్ని రకాల మార్గాలు అన్వేషిస్తున్నామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నీరు- చెట్టు కింద చేపట్టిన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. రాయలసీమలో శాశ్వత కరవు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 2022 నాటికి భారత్‌లోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.