Begin typing your search above and press return to search.
బాబు ట్వీట్..వైసీపీ వైరస్ కరోనా కంటే డేంజరట!
By: Tupaki Desk | 8 Feb 2020 9:56 PM ISTనారా చంద్రబాబునాయుడు... టీడీపీ అధినేతగానే కాకుండా సీఎంగా 14.5 ఏళ్ల పాటు వ్యవహరించిన సీనియర్ నేతగా - మరో 11 ఏళ్ల పాటు విపక్ష నేతగా - మరింత కాలం పాటు మంత్రిగా... ఇలా చెప్పుకుంటూపోతే... బాబు నిజంగానే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి. అంటే... రాజకీయాల్లో తలపండిన నేతగానే చంద్రబాబును గుర్తించాలి. చంద్రబాబు తనకు తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నా... ఇతరులంతా ఆయనను సీనియర్ గానే పరిగణిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో బాబు తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగానే శనివారం వైసీపీపై ఆయన సంధించిన విమర్శలు నిలుస్తున్నాయని చెప్పాలి.
శనివారం ట్విట్టర్ వేదికగా ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు... అధికార వైసీపీ పై - ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వరుసగా సంధించిన మూడు ట్వీట్లలో చంద్రబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే.. ‘‘కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తోంది. దానిని మించిపోయింది వైసీపీ వైరస్. ఎనిమిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ను చెల్లాచెదురు చేస్తోంది. ఏపీ అంటేనే ఇన్వెస్టర్లు భయపడి పారిపోతున్నారు. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి.
సింగపూర్ కన్సార్షియం - కియా అనుబంధ సంస్థలు - ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ - ఆసియా పేపర్ అండ్ పల్ప్ - రిలయన్స్... అన్నీ క్యూ కట్టాయి 8 నెలల్లోనే. ఇది చాలదన్నట్టు అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖ మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట. ఒక్క కంపెనీని తెచ్చే సమర్ధత లేదు. యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు. అలాంటి మీకు... విశాఖలో లక్షణంగా ఐటి ఉద్యోగాలు చేసుకుంటున్న 18,000 మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా?’’ అంటూ చంద్రబాబు ఓ రేంజిలో విమర్శలు గుప్పించారు.
సరే... విపక్ష నేత హోదాలో చంద్రబాబు... అధికార పార్టీ పైనా - సీఎంపైనా విమర్శలు చేయడంలో తప్పు లేదు. అదే సమయంలో అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపైనా విమర్శలు గుప్పించవచ్చు. అయితే... ఏదో చిన్న పిల్లల మాదిరిగా - ఓ స్థాయి అంటూ లేని రాజకీయ నేత మాదిరిగా కరోనా వైరస్ మాదిరిగా వైసీపీ కూడా ఓ వైరస్ లా మారిందని - వైసీపీ వైరస్ అనీ... ఇలా చాలా మాటలనే చంద్రబాబు వినియోగించడం చాలా మందికి రుచించలేదనే చెప్పాలి. ఎందుకంటే... నిత్యం ట్విట్టర్ లో కాలక్షేపం చేస్తున్న టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కేశినేని నాని - వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి లాంటి నేతలు ఈ తరహా విమర్శలే చేసుకుంటున్నారు. మరి వారి స్థాయికి దిగజారిన చంద్రబాబు కూడా తన స్థాయిని తగ్గించుకుని మరీ ఇలా విమర్శలు చేయడం మాత్రం జనానికి రుచించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.