Begin typing your search above and press return to search.
కేసీఆర్+మోడీ..బాబులో ‘ఓటుకు నోటు’ భయం..
By: Tupaki Desk | 2 July 2018 12:14 PM ISTఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి.. రాజకీయాల్లో ఎవరు ఎవరితోనైనా కలువవచ్చు.. విడిపోవచ్చు. కానీ చంద్రబాబు తీరు అలా కాదు.. ఆయన కలవడు.. తనతోపాటు సన్నిహితంగా మెలిగే వారిని కలువనీయడు.. ఒకవేళ కలవాలని చూస్తే అదేదో పెద్ద తప్పుగా.. నష్టపోతావన్నట్టు ప్రొజెక్ట్ చేస్తాడు. తన అనుకూల ‘పచ్చ’మీడియాలో అభూతకల్పనలు సృష్టించి ప్రత్యర్థికి తన సన్నిహితులు జారిపోకుండా భయాలు సృష్టిస్తాడు.. ఇప్పుడు అదే జరిగింది.
ఫెడరల్ ఫ్రంట్ తో ఊదరగొట్టిన కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీతో గంటకు పైగా భేటి అయ్యాక ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఫ్రంట్ మాటే ఎత్తలేదు. ఇక ఆయన కొడుకు కేటీఆర్ కూడా ప్రధానిని భేటి అయ్యి ఏదో మంత్రాంగం నడిపాడు. నీతి అయోగ్ సమావేశంలో కూడా కేసీఆర్ విశేష ప్రాధాన్యం ఇచ్చారు ప్రధాని - కేంద్రమంత్రులు. ఈ నేపథ్యంలో బీజేపీకి కేసీఆర్ దగ్గరయ్యారనే ప్రచారం జరుగుతోంది.
అప్పట్లో మోడీపై ఒంటికాలి పై లేచి ఫెడరల్ ఫ్రంట్ అన్న కేసీఆర్ ను చంద్రబాబు పట్టించుకోలేదు. తనలాంటి సీనియర్ తోనే ఫ్రంట్ సాధ్యమని కేసీఆర్ జూనియర్ అంటూ పార్టీ సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు ఒక ప్రచారం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ తన ప్రయత్నాలు తాను చేశాడు. కానీ ఏవీ కొలిక్కి రాకపోవడంతో మనసు మార్చుకున్నాడు. రాజకీయ ప్రయోజనమో లేక తెలంగాణ అభివృద్ధి కోసమో కానీ బీజేపీతో మళ్లీ సాన్నిహిత్యం నెరుపుతున్నారు.
ఇక మోడీ-కేసీఆర్ బంధం బలపడడంపై చంద్రబాబులో ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిద్దరి కలిసి ఎక్కడ ఓటుకు నోటు కేసును తిరగదోడుతారో.. ఎక్కడ తన బండారం బయటపెడతారో అన్న భయం బాబును వెంటాడుతోందని అంటున్నారు. ఈ మధ్యే కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడి ముందుకెళ్లిన చంద్రబాబుకు జలకిచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఓటుకు నోటుపై సమీక్ష జరపడంతో బాబు సైలెంట్ అయ్యారు. ఇలా తాను గొంతు ఎత్తినప్పుడల్లా ఓటుకు నోటు బూచీని చూపి భయపెడుతున్న కేసీఆర్.. మోడీతో కలిస్తే చాలా ప్రమాదమని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ ను భయపెట్టడానికి చంద్రబాబు పచ్చ మీడియా వార్తలు వండి వారుస్తున్నాయి. తాజాగా ఆయన అనుకూల ‘పచ్చ’ పత్రికలో కేసీఆర్ మోడీతో కలిస్తే నష్టపోతావంటూ పెద్ద ఎడిటోరియల్ వచ్చింది. మోడీ అంటే ముస్లింలకు వ్యతిరేకమని.. అలాంటి మోడితో వెళితే తెలంగాణలో మెజార్టీగా ఉన్న ముస్లింలు ఓటేయరని.. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న మజ్లిస్ కూడా దూరమవుతుందని.. కేసీఆర్ ఓడిపోతారంటూ ఏవేవో కథనాలు అల్లేసి భయపెడుతున్నారు.
ఇలా ఓటుకు నోటు కేసు భయంతోనే మోడీతో కలువవద్దంటూ కేసీఆర్ ను పచ్చ మీడియా తో భయపెట్టే పనిలో బాబు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది... కానీ రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్... ఇలాంటి వాటికీ లొంగి బీజేపీ దోస్తీ కటీఫ్ చేసుకుంటాడా లేదా అన్నది వేచిచూడాలి మరి..